ఫ్రిజ్ లో ఆహారం పెట్టినప్పుడు ఈ పొరపాట్లు వద్దు
పండ్లు, కూరగాయలతోపాటు ఆహార పదార్థాలు కూడా పాడవకుండా ఉండేందుకు చాలామంది వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. దీనివల్ల అవి తాజాగా ఉంటాయి. అయితే ఫ్రిజ్ ఉన్నప్పుడు దాన్ని గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. తరుచుగా మనం చేసే పొరపాట్ల వరకు ఫ్రిజ్ తన పని తాను చేయకుండా మొండికేస్తుంటుంది. దీనివల్ల తొందరగా రిపేరు వస్తుంది. పెట్టిన పదార్థాలు కూడా చల్లబడవు. సమయం ఎక్కువగా తీసుకుంటాయి. అలాంటప్పుడు ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలి.
* ఉష్ణోగ్రతను 4°C నుంచి 5°C మధ్య సెట్ చేయాలి. ఫ్రిజ్ ను అత్యంత శీతల ఉష్ణోగ్రతకు సెట్ చేస్తే ఆహారాన్ని పాడవనీయకుండా సంరక్షించడంలో సహాయపడుతుంది. సాధారణంగా 40°F నుంచి 41°F వరకు సురక్షితమైన, చల్లని ఉష్ణోగ్రతకి అనువైనది.

* ఫ్రిజ్ లో ఉండే పదార్థాలు త్వరగా చల్లబడాలంటే తరుచుగా తలుపును తెరుస్తుండకూడదు. కొంతమంది పదే పదే తలుపు తెరుస్తుంటారు. దీనివల్ల బయట ఉష్ణోగ్రత లోపలికి వెళ్లి అందులో ఉండే పదార్థాలు త్వరగా చల్లబడవు
* చాలామంది ఫ్రిజ్ ను గోడకు ఆనించి పెడతారు. కానీ ఇది సరైంది కాదు. ఫ్రిజ్ కు, గోడకు మధ్య కొంత గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. దీనివల్ల ఫ్రిజ్ నుంచి వెలువడే వేడి సులువుగా బయటకు వెళ్లిపోతుంది. గోడకు ఆనించి ఉండటంవల్ల రిఫ్రిజిరేటర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్రిజ్ ను కూరగాయలు, ఆహార పదార్థాలతో నిండుగా ఉంచాలి. దీనివల్ల చల్లదనం బయటకు వెళ్లదు. ఖాళీగా ఉంటే చల్లదనం ఫ్రిజ్ లో స్టోర్ అవదు.
* రెగ్యులర్ క్లీనింగ్ ఉండాలి. ఫ్రిజ్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయడంవల్ల బాగుబా పనిచేస్తుంది. ఒకదానికొకటి సంబంధం ఉన్న భాగాలను కూడా శుభ్రం చేయాలి.












Click it and Unblock the Notifications