lockdown 4.0:ఆఫీసుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యారోగ్య శాఖ ఏం చెబుతోంది..?
లాక్‌డౌన్ 4.0 నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే కార్యాలయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. కనీస జాగ్రత్తలు తీసుకొని.. కరోనా వైరస్‌ను నివారించొచ్చు అని పేర్కొన్నారు.
అన్నీ కార్యాలయాల్లో ఉద్యోగులు/సిబ్బంది కనీసం మీటర్ దూరంగా ఉండాలి. అన్నీ సమయాల్లో భౌతికదూరం తప్పనిసరి. ఆఫీసుల్లో మొహానికి మాస్క్ పెట్టుకోవడం కూడా కంపల్సరీ అని పేర్కొన్నది. పదే పదే చేతులను హ్యాండ్ వాష్ చేసుకోవాలని.. పరిశుభ్రంగా లేకపోతే శానిటైజర్‌తో 20 సెకండ్ల పాటు వాష్ చేసుకోవాలని సజెస్ట్ చేసింది. ఒకవేళ జలుబు/దగ్గు వస్తే టిష్యూ లేదంటా కర్చీఫ్ తప్పకుండా పెట్టుకోవాలని కోరింది. లేదంటే చేయిని అయినా అడ్డుపెట్టుకోవాలని కోరింది. అనారోగ్యంగా ఉన్నట్లయితే అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించింది.

జలుబు లాంటి సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఒకవేళ వారికి కరోన వైరస్ సోకినట్లయితే... వేంటనే కార్యాలయ అధికారులకు రిపోర్ట్ చేయాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారు ఆఫీసుకు రావడం కంటే ఇంట్లో ఉండి పనిచేయడం మేలు అని అభిప్రాయపడింది. ఆఫీసుకు దగ్గర గదిలో ఉంటున్న కొందరికి కరోనా లక్షణాలు కనిపిస్తే.. మిగతావారు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలని కోరారు. వారికి మాస్క్‌లు అందజేసి.. వైద్యుల చేత పరీక్షించాలని సూచించింది. తర్వాత సంబంధిత కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించాలని.. లేదంటే 1075 నంబర్‌కి ఫోన్ చేయాలని కోరింది. వెంటనే వారిని స్థానిక ప్రజారోగ్య సిబ్బంది కాంటాక్ట్ అయి.. తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నది.












Click it and Unblock the Notifications