వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైవేపై బస్సులో మంటలు: ముగ్గురు సజీవ దహనం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో వోల్వో బస్సు మంటల్లో చిక్కుకుని 40మందికి పైగా సజీవదహనమైన ఘటన లాంటి ప్రమాదమే కర్ణాటకలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హుబ్లీ-ధార్వాడ్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

బెంగళూరు-పుణె జాతీయ రహదారి వరూర్ సమీపంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 16మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కాగా, పోలీసుల ప్రాథమిక విచారణలో బస్సులో మద్యం సీసాలు, సిగరెట్లు, మండే పదార్థాలు లభించినట్లు సమాచారం. వాటి రాపడి వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో వోల్వో బస్సు మంటల్లో చిక్కుకుని 40మందికి పైగా సజీవదహనమైన ఘటన లాంటి ప్రమాదమే కర్ణాటకలో చోటు చేసుకుంది.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

బెంగళూరు నుంచి హుబ్లీ-ధార్వాడ్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బెంగళూరు-పుణె జాతీయ రహదారి వరూర్ సమీపంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

మంటల్లో చిక్కుకుని మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 16మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

పోలీసుల ప్రాథమిక విచారణలో బస్సులో మద్యం సీసాలు, సిగరెట్లు, మండే పదార్థాలు లభించినట్లు సమాచారం. వాటి రాపడి వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
Three people were burnt alive as a private bus caught fire 22 kilometers away from Hubbali. The bus belonged to the Durgambar Travels. Carrying more than 15 passengers, the bus is alleged to have been carrying some explosive materials, that were triggered by a flame from cigarette.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X