Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎర్ర కోట వద్ద భారీ కంటైనర్ల గోడ ... ఆగస్ట్ 15 వేడుకల నేపధ్యంలో తొలిసారి ఇలా .. రీజన్స్ ఇవే !!

దేశ రాజధాని ఢిల్లీలో రానున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో భద్రతను పెంచిన కేంద్రం, సాధారణ ప్రజానీకాన్ని రెడ్ ఫోర్ట్ పరిసరాల్లోకి అనుమతించటం లేదు. ఎర్రకోట ప్రధాన ద్వారం వద్ద దారికి అడ్డంగా భారీ కంటైనర్లను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ కంటైనర్లతో భారీ గోడనే నిర్మించారు. కంటైనర్ లతో నిర్మించిన గోడ కారణంగా,ఎర్ర కోట లోపలికి ఎవరూ ప్రవేశించలేరని తెలుస్తుంది.

రిపబ్లిక్ డే నాటి హింస నేపధ్యంలో ఆగస్ట్ 15 పై అలెర్ట్

రిపబ్లిక్ డే నాటి హింస నేపధ్యంలో ఆగస్ట్ 15 పై అలెర్ట్

జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ పోలీసులతో ఘర్షణ పడిన దురదృష్టకర సంఘటన కారణంగా ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అలెర్ట్ అవుతున్నారు . అందులో భాగంగా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయబడ్డాయి. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీ పోలీసులు ఎర్రకోట ముందు ఏర్పాటు చేసిన పెద్ద కంటైనర్లు గ్రాఫిటీస్‌తో ఏర్పాటు చేయనున్నారు .

ఎర్ర కోట వద్ద భారీ కంటైనర్ల ఏర్పాటు.. రీజన్స్ ఇవే

ఎర్ర కోట వద్ద భారీ కంటైనర్ల ఏర్పాటు.. రీజన్స్ ఇవే

నివేదికల ప్రకారం, కంటైనర్ల గోడలపై స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ పెయింటింగ్‌లు పెయింట్ చేయబడతాయని వెల్లడించారు.జనవరి 26న గణతంత్ర దినోత్సవాలనాడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవాల్లో భద్రతాపరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్ర కోట నుంచి ప్రసంగిస్తారు. ఈ సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఇప్పటి నుండే భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు . ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేస్తున్న రైతులు ఆగస్ట్ 15 నాడు తమ నిరసన మరింత ఉధృతం చేసే అవకాశం లేకపోలేదు . అందుకే కేంద్రం అప్రమత్తమైంది.

పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రర్ గ్రూపుల దాడులకు అవకాశం .. ఇంటిలిజెన్స్ వార్నింగ్

పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రర్ గ్రూపుల దాడులకు అవకాశం .. ఇంటిలిజెన్స్ వార్నింగ్

ఇదే సమయంలో దేశ రాజధాని నగరంలో స్వాతంత్ర్య దినోత్సవాలను భగ్నం చేయడానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. డ్రోన్లతో దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా హెచ్చరించాయి.పాకిస్తాన్ మద్దతు ఉన్న టెర్రర్ గ్రూపులు దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భంగం కలిగించవచ్చని భద్రతా సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అశాంతి సృష్టించడానికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులు చేయవచ్చని భద్రతా సంస్థలు ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి.రాబోయే రోజుల్లో దేశ రాజధానిలో పెద్ద ఎత్తున దాడులను చేయడానికి ఉగ్రవాద గ్రూపులు పెద్ద కుట్ర చేస్తున్నాయని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.

ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ .. నిఘా పటిష్టం

ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ .. నిఘా పటిష్టం


జమ్మూలో జరిగిన డ్రోన్ దాడి నేపధ్యంలో దేశం అలెర్ట్ అయ్యింది . డ్రోన్ ముప్పు నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు . ఈసారి, చారిత్రాత్మక ఎర్రకోట వద్ద 4 యాంటీ-డ్రోన్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు . గత సంవత్సరం రెండు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయగా ఈసారి, వాటి సంఖ్యను మరింత పెంచనుంది. డ్రోన్ల బెదిరింపులను ఎదుర్కోవటానికి మొదటిసారిగా ఢిల్లీ పోలీసులు మరియు ఇతర భద్రతా సంస్థలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇదిలావుండగా, కొద్ది రోజుల క్రితం ఎర్ర కోట వెనుకవైపు అనుమానాస్పదంగా ఎగురుతున్న డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+