గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
వడోదర: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర సమీపంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
మంజుసర్ వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అయితే మంటలను ఆర్పేందుకు మూడు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి.

ఈ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం మాత్రం ఇంకా నిర్ధారించలేదు. అయితే చిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications