Kerala: నరబలి, మహిళల అవయాలు రూ. 20 లక్షలకు డీల్, బెంగళూరులో వాడు ఎవరు ?, లైలా !
తిరువనంతపురం/కొచ్చి: కేరళలో జరిగిన మహిళల నరబలి కేసు మరో మలుపు తిరిగింది. మంత్రగాడిని నమ్ముకున్న వైద్యుడు ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశాడు. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు నకిలి మాంత్రికుడికి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాడని, నరబలి తరువాత మహిళల అవయావలు లక్షల రూపాయలకు విక్రయించారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. బెంగళూరుకు చెందిన ఓ మాంత్రికుడికి మహిళల నర మాంసంతో పాటు వాళ్ల అవయవాలు రూ. 20 లక్షలకు డీల్ జరిగిందని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు. మాంత్రికుడు మోహమ్మద్ షఫీనే బెంగళూరులో ఉన్న మరో మాంత్రికుడితో ఈ డీల్ మాట్లాడడని విచారణలో నిందితులు అంగీకరించారని పోలీసులు అంటున్నారు. కేరళ నరబలి కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అడ్వాన్స్ గా రూ. 6 క్షలు
కేరళలో జరిగిన మహిళల నరబలి కేసు మరో మలుపు తిరిగింది. మంత్రగాడు మోహమ్మద్ షఫీ మాయమాటలతో మోసపోయిన నాటు వైద్యుడు భగవార్ సింగ్ ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశాడు. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు భగవార్ సింగ్ నకిలి మాంత్రికుడు మోహమ్మద్ షఫీ చేతికి అడ్వాన్ గా రూ. లక్షల రూపాయలు ఇచ్చాడని, ఈ విషయం మంత్రగాడు మోహమ్మద్ షఫీ స్వయంగా అంగీకరించాడని పోలీసులు అంటున్నారు.

నరమాంసంకు డిమాండ్ ?
నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు భగవార్ సింగ్ నకిలి మాంత్రికుడుడు మోహమ్మద్ షఫీకి రూ. 6 లక్షలు డబ్బులు ఇచ్చాడని, అయితే షఫీ ఆ డబ్బు చాలదు అని డాక్టర్ కు చెప్పాడని, నరబలి తరువాత పధ్మా, రోసలిన్ అవయావలు లక్షల రూపాయలకు విక్రయించాలని స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

బెంగళూరు మాంత్రికుడితో డీల్ ?
డాక్టర్ భగవార్ సింగ్ ఇంట్లో మొదల రోసలిన్ ను నరబలి ఇచ్చారు. ఆ సందర్బంలో బెంగళూరు మాంత్రికుడు వచ్చిన రోసలిన్ అవయవాలు తీసుకెలుతాడని మోహమ్మద్ షఫీ భగవార్ సింగ్, లైలా దంపతులను నమ్మించాడు. అయితే ఆ సందర్బంలో బెంగళూరు నుంచి ఎవ్వరు రాకపోవడంతో ఆ మాంసం పాతిపెట్టారని, కొన్ని ముక్కలు ఫై ఓవర్ కింద విసిరేశామని మోహమ్మద్ షఫీ అంగీకరించాడని పోలీసులు అంటున్నారు.

మహిళల అవయవాలు రూ. 20 లక్షలకు సేల్
బెంగళూరుకు చెందిన ఓ మాంత్రికుడికి మహిళల నర మాంసంతో పాటు వాళ్ల అవయవాలు రూ. 20 లక్షలకు విక్రయించడానికి డీల్ జరిగిందని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు. మాంత్రికుడు మోహమ్మద్ షఫీనే బెంగళూరులో ఉన్న మరో మాంత్రికుడితో ఈ డీల్ మాట్లాడడని విచారణలో నిందితులు అంగీకరించారని పోలీసులు అంటున్నారు.

ఫ్లైఓవర్ కింద మహిళల అవయవాలు
కేరళ నరబలి కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లై ఓవర్ కింద మహిళల శరీర అవయవాలు స్వాధీనం చేసుకున్నామని, ఆ మాంసం 10 కేజీలకు పైగా ఉందని, ఆ మాంసం ముక్కలు అక్కడ విసిరేశామని మంత్రగాడు మోహమ్మద్ షఫీ సమాచారం ఇచ్చాడని పోలీసులు అంటున్నారు.

మహిళల మాంసంతో వంట చేసిన కుక్కర్
రోసలిన్, పధ్మాలను నరబలి ఇచ్చిన తరువాత డాక్టర భగవార్ సింగ్, లైలా దంపతులు ఆ మాంసం కుక్కర్ లో ఉడకబెట్టి మటన్ కూర చేసుకుని తిన్నారని, ఆ కుక్కర్ స్వాధీనం చేసుకున్నామని, మాంసం ముక్కలును ల్యాబ్ కు పంపించామని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు.

బ్లాక్ మెయిల్... బెంగళూరు మంత్రగాడు ఎవరు ?
నరబలి ఇచ్చిన తరువాత డాక్టర్ భగవార్ సింగ్, లైలా దంపతులను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు లాక్కొవాలని మంత్రగాడు మోహమ్మద్ షఫీ స్కెచ్ వేశాడని, చివరి అందరూ అరెస్టు అయ్యారని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే బెంగళూరులో ఉన్నా ఆ మాంత్రికుడు ఎవరు ?, మోహమ్మద్ షఫీ చెబుతున్నది నిజమేనా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications