తల్లి రూప రాక్షసి: 15 నెలల పసికందును కాలితో తన్ని, గొంతునులిమిన కసాయి.. సీసీటీవీ ఫుటేజీ చూసి..

ఏం జరుగుతుందో తెలియడం లేదు. కాల ప్రభావమో ఏమో కానీ.. మంచి, మర్యాద కాదు కదా.. ప్రేమ, ఆప్యాయతలు అంటే తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల జరుగుతోన్న అమానుష ఘటనలు ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోన్నాయి. ఒడిశాలో ఓ తల్లి వికృతంగా ప్రవర్తించింది. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ పట్ల జాలీ, దయ లేకుండా ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సీసీటీవీ కెమెరా ఏర్పాటు..

సీసీటీవీ కెమెరా ఏర్పాటు..

ఒడిశా పూరీ జిల్లా గోప్ ప్రాంతంతో భార్యభర్తలు నివసిస్తున్నారు. వీరితో భర్త.. అమ్మ, నాన్న కూడా ఉంటున్నారు. దంపతులకు 15 నెలల బాబు కూడా ఉన్నారు. అయితే భార్య ఊరికే గొడవ పడుతోంది.. తాను ఉన్నప్పుడే ఇలా చేస్తే.. లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చూడాలని అనుకున్నాడు. ఆమెకి తెలియకుండా సీసీటీవీ కెమెరాలు బిగించాడు. ఎప్పటిలాగే తాను ఆఫీసుకు వెళ్లిపోయాడు. తర్వాత ఫుటేజీ చూసి.. నోరెళ్లబెట్టాడు.

వీడియో చూసి షాక్..

వీడియో చూసి షాక్..

తన భార్య ఇలా ప్రవర్తిస్తోందా అని షాక్ తిన్నాడు. తన కొడుకును కాలితో తన్నడం చూసి ఖంగు తిన్నాడు. వామ్మో అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిల్లాడినే కాదు.. తల్లిదండ్రులతో కూడా మంచిగా ప్రవర్తించదని పేర్కొన్నారు. వారిని టార్చర్ చేస్తుందని కంప్లైంట్‌లో వివరించారు.

ఎందుకు అలా చేశానంటే.. భార్య వివరణ

ఎందుకు అలా చేశానంటే.. భార్య వివరణ

భర్త ఆరోపణలు.. ఇలా ఉండగా.. భార్య మాత్రం అదేం కాదు అని చెబుతోంది. తనను అత్తమామలు వేధిస్తున్నారని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. వారితో విసిగి వేగలేక.. సమయానికి అన్నం కూడా తినలేకపోతున్నానని చెప్పారు. ఆకలికి తట్టుకోలేక.. తన కుమారుడిపై కోపం చూపిస్తున్నానని వివరించారు. భార్య భర్తల ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. విచారణ జరిపిస్తున్నారు.

దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

భార్య చెప్పిన దానిలో నిజం ఉన్నా.. కన్న కొడుకును.. అదీ పసికందుపై చేయిచేసుకోవడం మాత్రం దారుణం. వీడియో చూసిన నెటిజన్లు మహిళను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదేం పద్ధతి అంటూ చీవాట్లు పెడుతున్నారు. తీరు మార్చుకోవాలని.. భావి తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+