భార్యకు విడాకులిచ్చి పాలతో స్నానం చేసిన భర్త.. వీడియో వైరల్!

భార్యకు విడాకులు ఇచ్చిన ఒక భర్త విడాకులు వచ్చిన సంతోషంలో చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత 40 లీటర్ల పాలతో అతడు చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తుంది. అసలు భార్యకు విడాకులు ఎందుకు ఇచ్చాడు? విడాకులు ఇచ్చిన తర్వాత పాలతో ఏం చేశాడు? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? వంటి వివరాలలోకి వెళితే..

భార్యకు విడాకులిచ్చి పాలతో స్నానం చేసిన భర్త
అస్సాం రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ సంఘటనలో మానిక్ అలీ అనే ఒక వ్యక్తి భార్యకు విడాకులిచ్చి పాలతో స్నానం చేశాడు. నల్బరీ జిల్లా బరాలియపర్ గ్రామానికి చెందిన మానిక్ అలీ భార్య అదే గ్రామానికి చెందిన వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అంతే కాదు రెండు సార్లు ప్రియుడు తోటి ఇంటి నుండి పారిపోయింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది.

Husband divorces wife and takes bath in milk Video goes viral

కోర్టులో విడాకులు ఇవ్వటంతో సంతోషంలో భర్త
కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న మానిక్ అలీ భార్యను ఏమీ అనలేదు. ఆమెతో కలిసి ఉండడానికే ప్రయత్నించాడు. అయినప్పటికీ మళ్ళీ మూడోసారి కూడా భార్య ఇంటి నుండి పారిపోయింది. ఈసారి ఆమె తనవెంట కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళింది. దీంతో తట్టుకోలేకపోయిన అతను తనకు విడాకులు కావాలని కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. తాజాగా కోర్టు అతనికి విడాకులు మంజూరు చేయడంతో, భార్యపీడ విరగడయిందని సంతోషంలో అతడు పాలతో స్నానం చేశాడు.

40 లీటర్ల పాలతో స్నానం చేసిన వీడియో వైరల్

ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకొని మరీ స్నానం చేసాడు. ఇక విడాకులు వచ్చిన సందర్భంగా పాలతో స్నానం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈరోజు నుంచి తను స్వేచ్ఛ జీవిన తనకు పట్టిన మురికిని కడిగేసుకుని తాను ఇప్పుడే కొత్తగా పుట్టినట్లుగా ఉందని అతనికి ప్రతీకగా పాలతో స్నానం చేస్తున్నానని మానిక్ అలీ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పైన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+