భార్యపై అనుమానం.. తల నరికి ఆమె సోదరుడికి చూపించాడు..

శనివారం రాత్రి ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. రాత్రికి ఇంటికి వచ్చాక.. అందరు నిద్రపోతున్న సమయంలో.. గొడ్డలితో భార్య తల నరికేశాడు.

తిరుపతి: మనసులో ఒకసారి అనుమానం మొదలైందంటే.. ఒక్క క్షణం కూడా ఆ మనిషి కుదురుగా ఉండలేడు. అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సింది పోయి.. కక్ష సాధింపు ధోరణితో వెళ్లాలని ప్రయత్నిస్తే.. చివరికి నేరస్తుడిగానే తయారవుతాడు.

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను కడతేర్చిన ఘటన తాజాగా తిరుపతిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మునస్వామి అనే వ్యక్తి తన భార్య చిత్రపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు.

Husband kills wife on suspicion of illegal affair

మునస్వామి స్వస్థలం తమిళనాడులోని సేలం కాగా.. బతుకుదెరువు కోసం తమిళనాడుకు వచ్చి స్థిరపడ్డాడు. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన చిత్రతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కూడా ఉన్నారు.

అయితే గతకొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. శనివారం రాత్రి ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. రాత్రికి ఇంటికి వచ్చాక.. అందరు నిద్రపోతున్న సమయంలో.. గొడ్డలితో భార్య తల నరికేశాడు.

అనంతరం పక్కింట్లోనే నివాసముంటున్న చిత్ర సోదరుడిని నిద్రలోంచి లేపి మరీ.. చిత్ర తలను చూపించాడు. చిత్ర సోదరుడు షాక్ నుంచి తేరుకునే లోపే.. అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మునస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+