Police: భార్యను బయటకు పంపించి పోలీసు ఆత్మహత్య, ఆడ దెయ్యం భయపెట్టిందని కేసు పెట్టిన భార్య !
చెన్నై/మదురై: పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న యువకుడు మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. దంపతులకు పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలతో కలిసి అతను పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా కానిస్టేబుల్ ఆరోగ్యం క్షీణించింది. ప్రముఖ ఆసుపత్రిలో కానిస్టేబుల్ వైద్యం చేయించుకుంటున్నాడు. చాలాకాలంగా చికిత్స చేయించుకుంటున్న కానిస్టేబుల్ కు ఆరోగ్యం కుదటపడలేదు. అర్దరాత్రి పూట నిద్రలో కానిస్టేబుల్ నన్ను చంపద్దు, నువ్వు చెప్పినట్లు చేస్తాను అంటూ గట్టిగా కేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. ఏం జరిగింది ?, ఎవ్వరితో మాట్లాడుతున్నావు ? అంటూ భార్య ప్రశ్నిస్తే నా కలలోకి ఆడ దెయ్యం వస్తోందని, నన్ను విపరీతంగా భయపెడుతోందని అతను చెబుతున్నాడు. చాలాకాలం నుంచి ఉద్యోగానికి ఎక్కువగా సెలవులు పెడుతున్న కానిస్టేబుల్ ఇంట్లోని పూజ గదిలో నుంచి బయటకు రాకుండా అక్కడే ఉంటున్నాడు. కనపడిన ప్రతి గుడి తిరుగుతున్నాడు. కాళ్లకు చేతులకు కడియాలు తాయత్తులు కట్టుకున్నాడు. భార్య, పిల్లలను బంధువుల ఇంటికి పంపించిన కానిస్టేబుల్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నా భర్త కలలోకి ప్రతినిత్యం ఆడ దెయ్యం వచ్చి పీడిస్తోందని, అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కానిస్టేబుల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

10 ఏళ్ల క్రితం ?
తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలోని పెరుంబాక్కంలోని పల్లిక్కుడ వీధిలో ప్రభాకరన్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2011లో ప్రభాకరన్ కు తమిళనాడు పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది. తమిళనాడు సాయుధ బలగాలలో ప్రభాకరన్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభాకరన్ కు అతని సొంత ఊర్లో మంచోడు అనే పేరు ఉంది.

పోలీసు క్వాటర్స్ లో కాపురం
కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాకరన్ విష్ణుప్రియా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రభాకరన్, విష్ణుప్రియ దంపతులకు ఎళివలన్, తమిళమతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కడలూరులోని ఆనైకుప్పంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలీసు క్వాటర్స్ లో ప్రభాకరన్ అతని భార్య విష్ణుప్రియా, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.

అనారోగ్యానికి గురైన కానిస్టేబుల్
కొంతకాలంగా కానిస్టేబుల్ ప్రభాకరన్ ఆరోగ్యం క్షీణించింది. ప్రముఖ ఆసుపత్రిలో కానిస్టేబుల్ ప్రభాకరన్ వైద్యం చేయించుకుంటున్నాడు. చాలాకాలంగా చికిత్స చేయించుకుంటున్న కానిస్టేబుల్ ప్రభాకరన్ కు ఆరోగ్యం కుదటపడలేదు. ప్రభాకరన్ శరీరంలో తెల్ల రక్తకణాలు చాలా క్షీణించాని, వైద్యం చేస్తున్నా అతని ఆరోగ్యం కుదటపడటం లేదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

మహిళ ఆత్మహత్య చేసుకుందని తెలిసింది
ప్రభాకరన్ నివాసం ఉంటున్న పోలీసు క్వాటర్స్ లోని అతని ఇంట్లో (ప్రస్తుతం ప్రభాకరన్ ఉంటున్న ఇల్లు) ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం. క్వాటర్స్ లో కాపురం పెట్టిన తరువాత అక్కడ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రభాకరన్ కు తెలిసింది. అప్పటిను ప్రభాకరన్ భయపడటం మొదలుపెట్టాడని సమాచారం.

అర్దరాత్రి ఆడ దెయ్యంతో హడల్
ఇంట్లో అర్దరాత్రి పూట నిద్రలో కానిస్టేబుల్ ప్రభాకరన్ నన్ను చంపద్దు, నువ్వు చెప్పినట్లు చేస్తాను అంటూ గట్టిగా కేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. ఏం జరిగింది ?, ఎవ్వరితో మాట్లాడుతున్నావు ? అంటూ భార్య విష్ణుప్రియా ప్రశ్నిస్తే నా కలలోకి ఆడ దెయ్యం వస్తోందని, నన్ను విపరీతంగా భయపెడుతోందని ప్రభాకరన్ అతని భార్యకు చెబుతున్నాడు.

నెలలో 15 రోజులు సెలవు
ప్రభాకరన్ కొంతకాలంగా నెలలో 15 రోజుల పాటు సెలవు పెట్టి ఇంటిలోనే ఎక్కువగా ఉంటున్నాడు. చాలాకాలం నుంచి ఉద్యోగానికి ఎక్కువగా సెలవులు పెడుతున్న కానిస్టేబుల్ ప్రభాకరన్ పోలీసు క్వాటర్స్ లోని అతని ఇంట్లోని పూజ గదిలో నుంచి బయటకు రాకుండా అక్కడే ఉంటున్నాడు. ప్రభాకరన్ కనపడిన ప్రతి గుడి తిరుగుతున్నాడు. కానిస్టేబుల్ ప్రభాకరన్ కాళ్లకు చేతులకు కడియాలు తాయత్తులు కట్టుకున్నాడు.

భార్య, పిల్లలను బంధువుల ఇంటికి పంపించి ?
భార్య విష్ణుప్రియా, ఇద్దరు పిల్లలను బంధువుల ఇంటికి పంపించిన కానిస్టేబుల్ ప్రభాకరన్ అతను నివాసం ఉంటున్న పోలీసు క్వాటర్స్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు విష్ణుప్రియా ఇంటికి చేరుకుని తలుపు కొట్టినా ప్రభాకరన్ స్పందించకపోవడం, ఇంటి లోపల లాక్ చేసి ఉండటంతో ఆమె పై అధికారులకు సమాచారం ఇచ్చింది.

ఆడ దెయ్యం భయంతో నా భర్త ఆత్మహత్య
పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ప్రభాకరన్ శవమై కనిపించాడు. నా భర్త ప్రభాకరన్ కలలోకి ప్రతినిత్యం ఆడ దెయ్యం వచ్చి పీడిస్తోందని, అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కానిస్టేబుల్ భార్య విష్ణుప్రియా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఆ ఇంటిలో మహిళ ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు కానిస్టేబుల్ ప్రభాకరన్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ పోలీసు క్వాటర్స్ లో ఉంటున్న కుటుంబాలు హడలిపోతున్నాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ ప్రభాకరన్ నివాసం ఉంటున్న క్వాటర్స్ లో గతంలో నివాసం ఉంటున్న ఓ పోలీసు భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటున్నారు. అయితే పోలీసులకు ఎంతో ధైర్యం ఉంటుందని, అలాంటి పోలీసు ప్రభాకరన్ దెయ్యాల భయంతో భయపడి ఆత్మహత్య చేసుకోవడంతో సాటి పోలీసులు హడలిపోయారు. నిజంగా ఆ పోలీసు క్వాటర్స్ లో దెయ్యం ఉందా ?, లేక ప్రభాకరన్ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే విషయం అంతుచిక్కడం లేదని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications