హెచ్చరిక లేఖ: హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయానికి ఓ అగంతకుడి నుండి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సిబ్బంది అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణీకులను భద్రతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. లేఖలో విమానాన్ని పేల్చి వేస్తామని ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ బెదిరింపు లేఖ నేపథ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శుక్రవారం అలర్ట్ ప్రకటించారు. ఓ విమానంలో పేలుడు పదార్థాలు రవాణా అవుతున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ పోర్టు ప్రధాన భద్రతాధికారి పేరిట ఈ లేఖ అందింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ ఎత్తున సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు స్నిఫర్ డాగ్స్‌ను మోహరించారు.
కాగా, దిల్ సుఖ్ నగర్ పేలుళ్లకు ఏడాది పూర్తయింది. ఈ దృష్ట్యా కూడా భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే భద్రత కట్టుదిట్టం చేశామని భద్రతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications