మహారాష్ట్ర సిమి సభ్యుడి నుంచి హార్డ్‌డిస్క్‌ల స్వాధీనం

యవత్మాల్: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమి) సభ్యుడు షా ముదస్సిర్ అలియాస్ తల్హా ఉపయోగించాడని భావిస్తున్న రెండు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆల్‌ఖైదా నుంచి శిక్షణ తీసుకోవడానికి అప్ఘనిస్థాన్‌కు వెళ్లాలని పథకం వేస్తున్నారనే ఆరోపణల మీద ముదస్సిర్ తోపాటు ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్త, పుణె ప్రాంత ముజాహిదీన్ మీడియా ఇంఛార్జ్ ఆలీ పీర్‌బాయ్ సహాయకుడైన షొయబ్ అహ్మద్ ఖాన్ అలియాస్ తారిఖ్ భాయ్‌ని పోలీసులు అక్టోబర్ నెలలో సికింద్రాబాద్‌లో అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఉమేర్‌ఖేడ్‌లో ముదస్సిర్ కంప్యూటర్, మొబైల్ దుకాణాన్ని నడిపేవాడు. తన బంధువు ఇంట్లో కంప్యూటర్‌ను కూడా వాడుకునేవాడు. అదనపు ఎస్పీ డి హరీశ్‌కుమార్ నేతృత్వంలోని బృందం మంగళవారం ఉమర్‌ఖేడ్‌కు చేరుకొని ముదస్సిర్ దుకాణంతోపాటు ఇంట్లోనూ సోదాలు చేసింది.

Hyderabad police seizes computer hard disks of Maharashtra SIMI operative

ఈ సోదాల్లో భాగంగా 2 కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారని ఉమర్‌ఖేడ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. అక్రమ వ్యాపారాల చట్టం, ఐటి చట్టంలోని సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ముదస్సిర్, తారిఖ్‌లపై కేసు నమోదైంది.

మళ్లీ తెగపడిన పాక్

జమ్మూకాశ్మీర్: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. జమ్మూకాశ్మీర్‌లోని సాంబ జిల్లా రంగఢ్ సెక్టార్‌లో బుధవారం పాక్ సైనికులు రెండు సార్లు కాల్పులు జరిపినట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాల్పుల విరమణ ఉల్లంఘనలకు 12 రోజులుగా విరామం ఇచ్చిన పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడిందని ఆయన చెప్పారు. భారత బలగాలు సంయమనం పాటించాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+