ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ : కర్నాటకలో కాంగ్రెస్ దే అధికారం- 117-124 సీట్లతో..
హైదరాబాద్ కు చెందిన శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ (ఎస్ఏఎస్) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 117-124 సీట్లు దక్కబోతున్నట్లు ఆత్మసాక్షి సర్వేలో పేర్కొంది. బీజేపీ కేవలం 83-94 సీట్లకు పరిమితం కానున్నట్లు ఎగ్జిట్ పోల్ తెలిపింది. జేడీఎస్ కు 23-30 సీట్లు దక్కబోతున్నాయి. దీంతో మ్యాజిక్ మార్క్ 113 సీట్లను కాంగ్రెస్ సాధించబోతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.
కర్నాటకలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా భారీగా పెరగబోతోందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీ 42.5 శాతం ఓట్లు సాధించబోతోంది. అలాగే బీజేపీకి 34.5 శాతం, జేడీఎస్ కు 16 శాతం ఓట్లు దక్కబోతున్నాయి. ఇతరులకు 7 శాతం ఓట్లు లభిస్తాయని ఆత్మసాక్షి తెలిపింది. 2018 ఎన్నికల్లో 36.35 శాతం ఓట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి 1.85 శాతం ఓట్లు కోల్పోయి 34.5 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని సర్వే వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీ 2018లో సాధించిన 38.4 శాతం ఓట్ల కంటే ఈసారి 4.36 శాతం ఓట్లు పెంచుకుని ఈసారి 42.5 శాతం ఓట్లు తెచ్చుకుంటున్నట్లు ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. మూడో పార్టీ జేడీఎస్ 2018లో 18.3 శాతం ఓట్లు సాధిస్తే ఈసారి మాత్రం 2 శాతం కోల్పోయి 16 శాతానికే పరిమితం కానుంది. ఇతరులు కూడా 2018లో 7.21 శాతం ఓట్లు తెచ్చుకోగా.. ఈసారి 7 శాతానికి పరిమితం కానున్నట్లు ఎగ్జిట్ పోల్ చెబుతోంది.
మరోవైపు ఈసారి సీఎంగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్యకు 41 శాతం మంది మద్దతునిస్తున్నట్లు ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. అలాగే ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మైకు కేవలం 22 శాతం మందే మద్దతునిస్తున్నారు. జేడీఎస్ నేత కుమారస్వామికి 14 శాతం మంది మద్దతుగా నిలిచారు. మాజీ సీఎం యడ్యూరప్పకు 5 శాతం, పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ కు తలో 5 శాతం మంది సీఎంగా మద్దతునిస్తున్నట్లు సర్వే తెలిపింది.












Click it and Unblock the Notifications