ప్రతిరోజూ మానసిక క్షోభను అనుభవిస్తూనే ఉన్నా: ఉబెర్ క్యాబ్ బాధితురాలు
న్యూఢిల్లీ: తాను ప్రతి రోజూ మానసిక క్షోభను అనుభవిస్తూనే ఉన్నట్లు గత ఏడాది న్యూఢిల్లీలో ఉబెర్ టాక్సీ డ్రైవర్ చేతిలో అత్యాచారానికి గురైన 25ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఆ దారుణ సంఘటనను తాను మరచిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ, పదే పదే దాన్ని గుర్తు చేసుకునేలా చేస్తున్నారంటూ తెలిపింది.

తాజాగా అత్యాచారం చేసిన డ్రైవర్ తరపు న్యాయవాది తనను రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు గుచ్చిగుచ్చి ప్రశ్నించి తనను మానసిక క్షోభకు గురి చేశారని ఆమె పేర్కొన్నారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె ఆదివారం మాట్లాడుతూ భారత్‌లో తన కార్యకలాపాలను మళ్లీ కొనసాగించాలని ఉబెర్ టాక్సీ సర్వీసు చూస్తోందని పేర్కొన్నారు.
మహిళలు సురక్షితంగా ఉన్నామని భావించే దాకా మనం సమానత్వం సాధించలేమన్న ఆమె, ఈ విషయాన్ని ఉబెర్ సర్వీసు అర్ధం చేసుకోవడం లేదని ఆరోపించారు. ఉబెర్ సర్వీసు పైపై మెరుగులు దిద్దుకుని "గాయం అవమానంగా" భావిస్తున్నామనంటూ మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.












Click it and Unblock the Notifications