పెళ్లి ఎప్పుడు అంటే రాహుల్ గాంధీ జవాబు ఇదీ, తన గురించి ఓ సీక్రెట్ చెప్పారు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఢిల్లీలో గురువారం జరిగిన ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 112వ వార్షిక సదస్సుకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి బాక్సర్ విజేందర్‌ కూడా వచ్చారు. పలువురు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ వేదికపై నిలబడి సమాధానాలు ఇచ్చారు. విజేందర్ కూడా అడిగారు.

రాహుల్‌ మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని విజేందర్ అడిగారు. అందుకు రాహుల్‌ మాట్లాడుతూ... ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుందని, తాను విధిని నమ్ముతానని చెప్పారు.

I Believe In Destiny, Rahul Gandhi Says, Questioned On Marriage

స్విమ్మింగ్ సహా పలు క్రీడల్లో తాను శిక్ష‌ణ తీసుకున్న‌ట్లు రాహుల్ అంతకుముందు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను బ్లాక్ బెల్ట్ సాధించిన‌ అకిడో క్రీడ గురించి చాలామందికి తెలియదన్నారు.

ఈ క్రీడలో త్రోయింగ్, జాయింట్ లాకింగ్, స్ట్రిక్కింగ్, పిన్నింగ్ టెక్నిక్స్ వంటివి ఉంటాయన్నారు. త‌న‌కు బ్లాక్ బెల్ట్ వ‌చ్చింద‌న్న విష‌యాన్ని తాను ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా బ‌య‌ట‌పెట్టలేద‌న్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Asked, not for the first or last time, when he will get married, Rahul Gandhi today invoked destiny. "Jab hogi, hogi (It will happen when it happens). I believe in destiny," the Congress Vice President said, replying to a question by Olympics medalist Vijender Singh at a business awards meet.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి