వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ వర్సెస్ నితీశ్ - ప్రధాని అభ్యర్ధిపై ప్రశాంత్ కిశోర్ సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ బిహార్ వైపు చూపులు సారించాయి. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను కూల్చుకుంటూ వెళ్లిన భారతీయ జనతా పార్టీకి తొలిసారిగా రివర్స్ షాక్ తగిలిందక్కడ. బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనత దళ్ (యునైటెడ్) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పగలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

 బిహార్ పరిణామాల వెనుక..

బిహార్ పరిణామాల వెనుక..

బీజేపీకి రివర్స్ షాక్ తగలడం వెనుక ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రమేయం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆయన స్వరాష్ట్రం.. బిహార్. ఇదివరకు జేడీయూ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ పార్టీకి ప్రధాన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్ట దలిచిన కొన్ని వివాదాస్పదమైన బిల్లులకు నితీష్ కుమార్ మద్దతు ప్రకటించడంతో ప్రశాంత్ కిషోర్.. విభేదించారు. పార్టీ నుంచి బయటికి వచ్చారు.

 నితీష్‌తో టచ్‌లో..

నితీష్‌తో టచ్‌లో..

ఆ తరువాత కూడా నితీష్ కుమార్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వచ్చారనేది ఈ తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. చాపకింద నీరులా ఆయన వ్యవహరించారు. బీజేపీకి ఎసరు పెట్టారు. ప్రస్తుతం జేడీయూ .. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ మళ్లీ- నితీష్ కుమార్‌తో జట్టుకట్టే అవకాశాలు లేకపోలేదు. భవిష్యత్‌లో ఆయనను ప్రధానిమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు లేకపోలేదనే అంచనా ఉన్నాయి.

 ప్రశాంత్ కిషోర్ రియాక్షన్..

ప్రశాంత్ కిషోర్ రియాక్షన్..

బిహార్ పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. దీనిపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. బిహార్‌లో 12-13 సంవత్సరాలుగా రాజకీయ అస్థిరత ఉంటోందని గుర్తు చేశారు. 2012-13లో ఇలాంటి పరిణామాలే ఏర్పడ్డాయని చెప్పారు. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. 10 సంవత్సరాల వ్యవధిలో ఇది ఎనిమిదో ప్రభుత్వం కావడం అస్థిరతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదయినా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారని అన్నారు.

జేడీయూ-బీజేపీ సంకీర్ణంపై

జేడీయూ-బీజేపీ సంకీర్ణంపై


నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్)-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తాను నిర్వహిస్తోన్న యాత్రల్లో ఈ విషయం స్పష్టమైందని వివరించారు. తాజాగా జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ అజెండా ఏమిటనేది తేలాల్సి ఉందని, అప్పుడే దీనిపై ప్రజలకు ఓ స్పష్టత ఏర్పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి మద్యనిషేధం కారణమైందని తాను అంచనా వేస్తోన్నట్లు ప్రశాంత్ కిషోర్ అన్నారు.

2024 నాటి ఎన్నికల్లో..

2024 నాటి ఎన్నికల్లో..


2024 నాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్‌ను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం గురించి ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీతో కూటమి కట్టిన తరువాత నితీష్ కుమార్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేకపోయారని భావిస్తున్నట్లు చెప్పారు. 2017 ఎన్నికలకు ముందు ఉన్న నితీష్ వేరు.. ఇప్పటి నితీష్ వేరు అని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయనను భావించట్లేదని చెప్పారు.

Recommended Video

బీజేపీ - టీడీపీ పొత్తు, తేల్చేసిన కాషాయం సీనియర్ నేత *National | Telugu OneIndia
 బిహార్ దాటితే..

బిహార్ దాటితే..

బిహార్ దాటితే ఆయన ప్రభావం భారీగా ఉంటుందని తాను అనుకోవట్లేదని తేల్చి చెప్పారు. బిహార్ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం లేదని పేర్కొన్నారు. తాజాగా జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల వంటి ఏడు పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమి కూడా ఇదివరకట్లా ప్రభావం చూపబోదని వ్యాఖ్యానించారు. గతంలో నితీష్ కుమార్‌ పార్టీకి 115 సీట్లు వచ్చాయని, అది క్రమంగా తగ్గుతూ 45కు పడిపోయాయని గుర్తు చేశారు.

English summary
Poll strategist Prashant Kishor said that he believe the latest political developments in Bihar are specific to the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X