హత్యలు చేశా, మళ్లీ ప్రారంభిస్తా: ఎమ్మెల్యే హెచ్చరిక
పాట్నా: బీహార్‌లో అధికార జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నౌగాచియా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మండల్ మాట్లాడుతూ.. 'నా దగ్గర తుపాకీ, పేలుడు పదార్థాలున్నాయి. మళ్లీ వాటికి పనిచెప్పి హత్యారాజకీయాలు మొదలెడతాను' అన్నారు.
భగల్పూర్ జిల్లా గోపాల్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేయకపోయినా తన అధికారం, ఆయుధాలతో వారిని కాపాడతానని ప్రకటించారు. 'గతంలో ఎన్నో హత్యలు చేశాను. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తాను'అని ఆయన అన్నారు.
అయితే, గోపాల్ మండల్ వ్యాఖ్యలపై సొంత పార్టీకి చెందిన నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను తాము సమర్థించబోమని చెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా సదరు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గోపాల్ మండల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జేడీయూ ప్రకటించారు.

కాగా, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మండల్‌కు కొత్తేమీ కాదు. గతంలో నౌగచియా బజార్‌లో ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తన వ్యతిరేకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన మద్దతుదారుల జోలికొస్తే నాలుక కోసేస్తాని హెచ్చరించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్య నిషేధం అమలునూ మండల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మధ్యనిషేధం అమలుచేయాలని సిఎం యోచిస్తున్నారు. కాగా మండల్ వ్యాఖ్యలపై జెడియు అధికార ప్రతినిధి అజయ్ అలోక్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications