వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారిపోలేదు: విమర్శలపై మాల్యా ఆవేదన

|
Google Oneindia TeluguNews

లండన్/న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో మాల్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, రాజ్యసభలో కూడా ఈ అంశంపై చర్చ జరగడంతో ఎట్టకేలకు విజయ్‌మాల్యా శుక్రవారం ఉదయం ట్విట్టర్‌లో స్పందించారు.

తాను ఎక్కడికీ పారిపోలేదని, వ్యాపార నిమిత్తం తరచు విదేశాలకు వెళుతుంటానని చెప్పుకొచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశానని, భారతీయ చట్టాలపై తనకు గౌరవం, నమ్మకం ఉందని పేర్కొన్నారు.

కార్టూన్ : విజయ్ మాల్యా జంప్

తాను పారిపోయినట్లు మీడియాలో వార్తలు రావడం తననెంతో బాధకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీఈర్పీ కోసం మీడియా ఛానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. మీడియాకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, విజయ్‌మాల్యా వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.

లండన్‌లోనే బస

అంతకుముందు జరిగిన పరిణామాలను పరిశీలించినట్లయితే.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా దేశం విడిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్‌లోనే ఉన్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. లండన్ శివారు ప్రాంతంలోని బేకర్ స్ట్రీట్ ప్రాంతంలో ఆయనకు చెందిన 30 ఎకరాల్లో విస్తరించిన 'లేడీవాక్' అనే ఎస్టేట్‌లో ఆయన బస చేసినట్లు సెక్యూరిటీ సిబ్బంది లండన్ మీడియాకు తెలిపారు.

అయితే అసలు విషయం తెలిసిన తర్వాత మాల్యా గురించి తమకేమీ తెలియదని బుకాయించారని స్థానిక మీడియా పేర్కొంది. కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు లండన్‌తో పాటు కాలిఫోర్నియాలో కూడా ఆస్తులు ఉన్నాయి. లండన్‌లోని తివిన్ విలేజిలోని క్వీన్ హో లేన్‌లో అతిపెద్ద కంట్రీ హోమ్‌ను కలిగి ఉన్నాడు.

విజయ్‌ మాల్యా

తాను ఎక్కడికీ పారిపోలేదని, వ్యాపార నిమిత్తం తరచు విదేశాలకు వెళుతుంటానని చెప్పుకొచ్చారు.

విజయ్‌ మాల్యా

రాజ్యసభ సభ్యుడిగా పనిచేశానని, భారతీయ చట్టాలపై తనకు గౌరవం, నమ్మకం ఉందని పేర్కొన్నారు.

విజయ్‌ మాల్యా

తాను పారిపోయినట్లు మీడియాలో వార్తలు రావడం తననెంతో బాధకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్‌ మాల్యా

టీఈర్పీ కోసం మీడియా ఛానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు.

విజయ్‌ మాల్యా

మీడియాకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, విజయ్‌మాల్యా వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.

English summary
I have not fled the country says former chairman of the UB group Vijay Mallya. In a series of tweets early this morning, Vijay Mallya said that he is an international businessman and he travels to and from India frequently. I did not flee from India and neither am I an absconder, Mallya said in his tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X