షీనా హత్య: నిజం తెల్సు.. ఇంద్రాణికి కొడుకు హెచ్చరిక
ముంబై: ఇంద్రాణి కూతురు షీనా బోరా హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. స్టార్ ఇండియా మాజీ అధిపతి పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి. వీరు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇంద్రాణికి గతంలోనే రెండు వివాహాలు అయ్యాయి.
గతంలోని వివాహాల వల్ల ఆమెకు కూతురు షీనా బోరా, తనయుడు మిఖాయిల్ బోరా ఉన్నారు. కూతురు షీనాను తల్లి ఇంద్రాణి హత్య చేసిన ఉదంతం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే.
దీనిపై ఇంద్రాణి తనయుడు మిఖాయిల్ స్పందించారు. తల్లి తన సోదరిని హత్య చేయడానికి దారి తీసిన అసలు కారణం తనకు తెలుసునని చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలు వేరని, అసలు నిజం వేరన్నారు. అసలు నిజం తనకు తెలుసని చెప్పారు. తన తల్లి చెప్పకుండే నేనే చెబుతానని హెచ్చరించారు.

అమ్మ తమ అక్కయ్యను తన చెల్లిగా చెప్పడం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. తొలి నుంచీ కూడా అమ్మ అబద్దాలు చెబుతూనే ఉందనిపిస్తోందన్నారు. షఈనాను అమ్మే వచ్చి ముంబై తీసుకెళ్లి అక్కడ కాలేజీలో చేర్పించిందని చెప్పారు. తర్వాత షీనా ఓ కార్పోరేట్ సంస్థలో ఉద్యోగిగా చేరిందన్నారు.
షఈనా అమెరికాలో చదువుకుంటోందని మాత్రమే అమ్మ చెప్పేదని, తాను ఆ మాటనే నమ్మానని తెలిపారు. 2013లో అమ్మ గౌహతి వచ్చిందన్నారు. తమకు, అమ్మమ్మ, తాతయ్యలకు అమ్మనే ముంబై నుంచి డబ్బు పంపించేదని, కొన్నేళ్ల నుచి నయా పైసా కూడా పంపటం లేదన్నారు.
తనను అమ్మ అని పిలవనద్దని తన తల్లి ఇంద్రాణి కచ్చితంగా చెప్పేదని, అక్కయ్య హత్యకు గురైనట్లు వచ్చిన వార్తలతో తన మనసు ఆవేదన చెందుతోందన్నారు. తన అక్క హత్య కావడానికి గల నిజాలు తనకు తెలుసునని, అందుకు సంబంధించిన పిక్చర్స్ తన వద్ద ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications