నాలుగేళ్లు వాడుకుని వదిలేశాడు: నటుడిపై కేసు పెట్టిన హీరోయిన్, బ్లాక్ మెయిల్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: స్యాండిల్ వుడ్ లో మరో లవ్ స్టోరీ వివాదానికి దారి తీసింది. తనను పెళ్లి చేసుకుని నాలుగేళ్లు వాడుకుని వదిలేశాడని ప్రముఖ నటి సహ నటుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నదని ఆ హీరోయిన్ మీద నటుడు ఫిర్యాదు చేశాడు. నటీ నటుడు ఇద్దరూ పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

'ఐ లవ్ యూ'అనే కన్నడ సినిమాలో రాధికా శెట్టి హీరోయిన్ గా నటించింది. అదే సినిమాలో అమిత్ అనే సహాయ నటుడు నటించాడు. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారని తెలిసింది. అయితే రాధిక శెట్టిని వివాహం చేసుకోవడానికి అమిత్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదని సమాచారం.

I Love You kannada movie actress Radhika Shetty gave complaint against actor Amith

కుటుంబ సభ్యులను ఎదిరించిన అమిత్ తనను 2013లో సిగందూరులోని శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో తనను పెళ్లి చేసుకున్నాడని రాధిక శెట్టి ఆరోపిస్తున్నది. అప్పటి నుంచి ఇద్దరూ వేరుగా కాపురం పెట్టామని రాధిక శెట్టి అంటున్నారు.

నాలుగు సంవత్సరాలు తనతో కాపురం చేసిన అమిత్ ఇప్పుడు వేరే యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడని, తన కోరిక తీర్చుకుని నన్ను మోసం చేశాడని రాధిక శెట్టి బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాను రాధిక శెట్టిని వివాహం చేసుకోలేదని, ఆమె తనను వేధింపులకు గురి చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అమిత్ ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన రాజరాజేశ్వరి నగర పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I Love You kannada movie actress Radhika Shetty gave complaint against actor Amith in Rajarajeshwari police station Bengaluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి