"ఐ లవ్ యూ" చెప్పి బుట్టలో వేసింది: సినీ స్టైల్‌లో నిందితుడిని పట్టుకున్న లేడీ ఎస్సై!

నేటి రోజుల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడేవారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడానికి కొత్త పద్ధతులను వాడుతున్నారు. అయితే గుజరాత్‌లోని సూరత్‌లో ఓ మోసగాడిని పట్టుకోవడానికి మహిళా పోలీస్ అధికారి(పీఎస్సై) శీతల్ చౌదరి ఓ సినిమాటిక్ స్టైల్ వ్యూహాన్ని అమలు చేశారు. రూ.30 లక్షల రూపాయల లోన్ మోసం కేసులో నిందితుడైన గిరీష్ దేవడాను ఈ పీఎస్ఐ చాకచక్యంగా అరెస్ట్ చేయగలిగారు.

అసలు కేసు ఏంటంటే..?
సూరత్‌కు చెందిన మోసగాడు గిరీష్ దేవడా 30 లక్షల రూపాయల లోన్ తీసుకుని ఒక ఫార్చ్యూనర్ కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆ కారును వేరే వారికి అమ్మేసి తీసుకున్న లోన్ తిరిగి చెల్లించకుండా ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. గిరీష్ తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, కేవలం వాట్సాప్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాడు. దీంతో అతడి ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు కష్టమైంది.

I Love You Trap Lady PSI Sheetal Chaudhary Catches Loan Fraudster in Filmy Style

పీఎస్సై శీతల్ చౌదరి ప్లాన్
ఈ తెలివైన మోసగాడిని పట్టుకోవడానికి పీఎస్సై శీతల్ చౌదరి తనదైన స్టైల్‌లో ఓ వ్యూహాన్ని రచించారు. శీతల్ చౌదరి తన అసలు గుర్తింపును దాచి, వాట్సాప్‌లో 'పూజ' అనే పేరుతో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించారు. 'పూజ'గా గిరీష్ దేవడాను వాట్సాప్‌లో సంప్రదించారు. దాదాపు 25 రోజుల పాటు వారిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. వారి సంభాషణ క్రమంగా రొమాంటిక్‌గా మారింది. ఈ చాట్‌లో 'ఐ లవ్ యూ', 'మిస్ యూ' వంటి సందేశాలు కూడా పంపుతూ గిరీష్‌ను తమ వలలోకి దించారు. చాటింగ్‌లో పూర్తిగా పడిపోయిన మోసగాడు గిరీష్, 'పూజ'ను కలవడానికి సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతానికి వచ్చాడు.

'పూజ'ను కలవాలనే ఉద్దేశంతో పర్వత్ పాటియాకు చేరుకున్న గిరీష్ దేవడాకు అక్కడ అనూహ్యమైన స్వాగతం లభించింది. అతడి కోసం వేచి చూస్తున్నది రొమాంటిక్ 'పూజ' కాదు, పోలీస్ యూనిఫాంలో ఉన్న పీఎస్ఐ శీతల్ చౌదరి, ఆమె టీమ్. శీతల్ చౌదరి తెలివిగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె సూక్ష్మబుద్ధి వల్ల కేవలం గిరీష్ దేవడానే కాదు, అతడి సహచరుడు కుల్దీప్ సోలంకిని కూడా అరెస్ట్ చేయగలిగారు. ఈ కేసు ఛేదనలో శీతల్ చౌదరి ప్రదర్శించిన చాకచక్యంపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+