నేను మామూలు మనిషిని: ఆలింగనాలపై కాంగ్రెసుకు రిప్లై
న్యూఢిల్లీ: ప్రపంచ నేతలకు స్వాగతం పలికే సమయంలో తాను ఇచ్చే ఆలింగనాలపై కాంగ్రెసు చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ తిప్పికొట్టారు. తాను సాధారణ వ్యక్తినని, తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని అన్నారు.
తాను అరమరికలు లేకుండా వ్యవహరించడం ప్రపంచ నేతలకు నచ్చిందని అన్నారు. ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మార్చుకోవడం తన ప్రాథమిక స్వభావమని అన్నారు.

తాను సాధారణమైన వ్యక్తిని అయినందున తనకు అన్ని ప్రోటోకాల్స్ తెలియవని, తాను అరమరికలు లేకుండా వ్యవహరించడం ప్రపంచానికి నచ్చిందని, స్నేహసంబంధాలు చేతికి అందుతున్నాయని అన్నారు.
తాను కూడా ఇతరుల మాదిరిగా శిక్షణ పొంది ఉంటే కుడిఎడమలకు చూస్తూ కరచాలనం చేస్తూ తాను కూడా ప్రోటోకాల్స్ పాటించి ఉండేవాడిని, అయితే తాను అతి సాధారణ వ్యక్తినని, దేశానికి ఏ విధమైన హానీ జరగకుండా చూడడానికే తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు.
తాను ప్రధాని పదవి చేపట్టినప్పుడు మోడీకి గుజరాత్ వెలుపలి విషయాలు ఏవీ తెలియవని అనేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. తన విదేశీ విధానం ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరూ అడగడం ప్రారంభించారని, తనకు అనుభవం లేదు కాబట్టి అలా అడగడం సబబేనని, అనుభవం లేకపోవడం తనకు కలిసి వచ్చిందని, తనపై ఏ విధమైన భారం లేదని అన్నారు.
ప్రపంచ నేతల ముందు తాను నిలబడుతున్నప్పుడు తాను నరేంద్ర మోడీననే భావన ఉండదని, 1.25 బిలియన్ ప్రజల ప్రతినిధిగా తాను నిలబడుతున్న భావన ఉంటుంందని అన్నారు.












Click it and Unblock the Notifications