వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

45 రోజులు వయసున్న నా చిన్నారిని రక్షించుకునేందుకు నేను పోరాడుతున్నాను

పుట్టీ పుట్టగానే ఓ చిన్నారి ప్రాణాంతక సెప్సిస్ వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం కుర్లాలోని హోలీ స్పిరిట్ ఆసుపత్రిలోని ఎన్ఐయూసీలో చికిత్స పొందుతోంది.

Google Oneindia TeluguNews

నెలల నిండకముందే పుట్టిన ఓ చిన్నారికి నేను తండ్రిని. సరిగ్గా 45 రోజులు 4 గంటల క్రితం నా తొలి సంతానం నా జీవితంలోకి అడుగుపెట్టింది. కానీ పుట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు నేను నా పాపను నా ఒడిలోకి కూడా తీసుకోలేకపోయాను, డాక్టర్లు నన్ను నా పాప దగ్గరకి రానివ్వడమే కాదు, కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోనివ్వలేదు. ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోని బెడ్ పై పడి ఉన్న నా పాపని ఆ గది అద్దాల గుండా చూస్తుంటే.. నా గుండె పిండేసినట్లవుతోంది. నాకు సరిగా గుర్తు లేదు.. నోట్లో సన్నపాటి పైపుతో, శరీరంపై సూదులు గుచ్చబడి, బలహీనంగా ఊపిరి పీల్చి ఒదులుతున్న ఆ చిన్ని శరీరాన్ని నా దగ్గర్నించో, లేక వాళ్ల అమ్మ దగ్గర్నించో బలవంతంగా లాగేసుకున్నారు!

నా పేరు నజీర్ అహ్మద్ షేక్. 2013 అక్టోబర్ నెలలో సీమా అనే అందమైన యువతిని నేను పెళ్లిచేసుకున్నాను. మా దురదృష్టం ఏమిటోగానీ.. పెళ్లికి ముందే మేమిరువురం మా తల్లిదండ్రులను కోల్పోయాం. పెళ్లయ్యాక కొన్ని నెలలకు, మాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని నిర్ణయించుకున్నాం. అది మా జీవితంలో మరపురాని క్షణం. నా భార్య కూడా నాలాగే ఆలోచిస్తోందని తెలిసి ఎంతో ఆనందపడ్డాను. చాలాకాలంపాటు ప్రయత్నించినా నా భార్య గర్భవతి కాలేదు. ఎందుకైనా మంచిదని.. ఓసారి డాక్టర్ ని కలవాలనుకుని వెళ్లి కలిశాం. కొన్ని పరీక్షలు చేసిన తరువాత తెలిసింది.. నా భార్య సీమా గర్భాశయంలో గడ్డ కారణంగా గర్భవతి కాలేకపోతోందని. ఆ క్షణంలో మేమిరువురం కుంగిపోయాం. కొన్ని రోజుల తరువాత కానీ మేం కోలుకోలేకపోయాం. ఎట్టకేలకు పెళ్లయిన 4 సంవత్సరాల తరువాత మా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. నా భార్య గర్భం దాల్చింది. మొత్తానికి నేను తండ్రిని కాబోతున్నాను.. అదొక అద్భుతమైన ఫీలింగ్!

ఆ క్షణం నుంచి నేను పుట్టబోయే నా బిడ్డ కోసం ఒక బాధ్యత గల తండ్రిగా మారేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేసేవాడిని. గర్భం దాల్చిన దగ్గరినుంచి ప్రసవం అయ్యేంత వరకు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేందుకు రకరకాల పుస్తకాలు చదివేవాడిని. అది రంజాన్ సీజన్.. ఆరోజు జూన్ 22, ఉన్నట్లుండి నా భార్య సీమా.. తనకు ఏదోలా ఉందని, కడుపులో విపరీతమైన నొప్పి వస్తోందని చెప్పింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితికి నేను సిద్ధంగా లేను. ప్రసవానికి ఇంకా 2 నెలల సమయం ఉండగానే.. ఇప్పుడు నొప్పులేంటి? ఒక్క క్షణం అర్థం కానట్టు నా భార్య మొహంలోకే చూస్తూ ఉండిపోయాను. ఆ తరువాత తేరుకుని కుర్లాలోని హబీబ్ ఆసుపత్రికి పరిగెట్టాం. అప్పట్నించి మొదలయ్యాయి నాకు ఊహించని కష్టాలు.

నా భార్య వాలకం చూడగానే అక్కడి డాక్టర్లకు ఆమె పరిస్థితి అర్థమైంది. ఆ ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు లేవని, వెంటనే తనని మరో ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. నేను మీనమేషాలు లెక్కిస్తుండడం చూసి చావు కబురు చల్లగా చెప్పారు. నా భార్య గర్భంలో శిశువు చుట్టూ ఉండే ఉమ్మనీరు లీకయిందని, మరో గంటలో నా భార్యకు శస్త్రచికిత్స జరగకపోతే తల్లీ బిడ్డ ఇద్దరూ బతకడం కష్టమని. నేను ఊహించలేదు.. ఇలాంటి పరిస్థితి నా కుటుంబానికి ఎదురవుతుందని. డాక్టర్లు చెప్పిన మాటలు వినగానే నేను నిశ్చేష్టుడినయ్యాను. ఆ క్షణంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నా మైండ్ లో ఇదే తిరుగుతోంది - నా భార్య, పుట్టబోయే నా బిడ్డ.. నాకు దక్కరా? 7 నెలలుగా నేను కన్న కలలు ఈ క్షణాన కల్లలు కాబోతున్నాయా?

కొంతమంది దగ్గరి స్నేహితుల సహాయంతో, నేను నా భార్యను హోలీ స్పిరిట్ హాస్పిటల్ లో చేర్పించాను. ఆపరేషన్ థియేటర్ లోకి నా భార్యను తీసుకెళ్లిన క్షణం నుంచి నా అంతరంగంలో ఒకటే ఆలోచనలు, నాకు చాలా భయమేసింది. నా జీవితంలో నేను చేసిన మంచి పనులను ఆ క్షణాన భగవంతుడు గుర్తు చేసుకున్నాడేమో నా ఆనందాన్ని నాకు దూరం చేయలేదు. ఆపరేషన్ గది నుంచి బయటికొచ్చిన డాక్టర్ చల్లని కబురు చెప్పాడు.. నా భార్యకి ప్రాణాపాయం తప్పిపోయిందని. డాక్టర్ చేతుల్లో నా చిన్నారిని చూడగానే నా ఆనందం అవధులు దాటింది. కానీ ఒకే ఒక్క క్షణం.. అంతలోనే హడావుడిగా నా చిట్టి తల్లిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు. అదిగో - ఆ క్షణం నుంచి నేను ఆ అద్దాల గది బయటే ఉండిపోయాను.. నా బిడ్డని కళ్లారా చూడడం కోసం.

నా బిడ్డది జీవన్మరణ సమస్య. ప్రాణాంతకమైన సెప్సిస్ వ్యాధితో బాధపడుతోందట. నెలలు నిండకమునుపే పుట్టడం వల్ల తన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదట. నా జీవితంలో నేనెన్నడూ చూడని భయంకర క్షణాలవి. నా చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగిడి ఊపిరి కూడా సరిగా పీల్చుకోలేక నరకం అనుభవిస్తున్న క్షణాలవి. పుట్టిన కొద్ది సేపటికే మెదడుకు అందాల్సినంత రక్తం సరఫరా అవక నా చిన్నారి అవస్థలు పడుతోంది. ప్రస్తుతం నా బిడ్డ ఊపిరి పీల్చుకునేందుకు డాక్టర్లు పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. తన హార్ట్ బీట్ పెరిగిపోతున్నప్పుడల్లా నా దేహంలోని రక్తం చల్లబడిపోతోంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. నా బిడ్డ బతకాలంటే... తప్పనిసరిగా ఆమెకు నిర్ణీత సమయాల్లో రక్త మార్పిడి జరగాల్సిందేనట. మా బిడ్డ ఎన్ఐసీయూలో పడుతోన్న బాధను నేను.. నా భార్య చూడలేకపోతున్నాం. ఇన్నాళ్లూ వెచ్చగా.. తన తల్లి గర్భంలో ప్రశాంతంగా ఉన్న నా బిడ్డ నిర్ణీత సమయం కంటే ముందుగానే ఈ లోకంలోకి అడుగుపెట్టి ఇప్పుడు నరకయాతన అనుభవిస్తోంది. నేనేం చేయగలను? ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి.

ఎన్ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చిన మరుక్షణం.. నా చిట్టి తల్లి నాకు దక్కదు. మరోవైపు పెరిగిపోతున్న ఆసుపత్రి బిల్లు చూస్తుంటే నాకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఆసుపత్రి బిల్లు చెల్లించలేని మరుక్షణమే నేను బలవంతంగా నా బిడ్డను తీసుకుని ఇంటికి తీసుకురావలసి ఉంటుంది. అలా జరిగిన మరుక్షణం నా బిడ్డ ప్రాణాలతో ఉండదు. నా చిట్టితల్లి ప్రాణం నిలబడడానికి దయచేసి సహాయం చేయండి. మీరు అందించే విరాళమే నాకిప్పుడు సర్వస్వం.

నా నెల జీతం రూ.8 వేలు. నా భార్య సీమా గృహిణి. ఇప్పటికే నా చిన్నారి ఆసుపత్రి ఖర్చు రూ.లక్షన్నర దాటింది. టెస్టులు, మందులు అన్నీ కలుపుకుంటే రూ.2,55,000 వరకు అవుతుంది. ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఇంత డబ్బు సంపాదించే స్థోమత నాకు లేదు. నా శ్రేయోభిలాషుల సహాయంతో నా చిట్టితల్లి ఆసుపత్రి బిల్లు విడతల వారీగా చెల్లించడానికి కొంత గడువు మాత్రం పొందగలిగాను. నిజానికి కొన్ని నెలల క్రితం... నా భార్య గర్భవతి అయిందనే వార్త చెప్పగానే నా బంధువులందరూ నన్ను అభినందించారు. ఎప్పుడు ఏ అవసరమొచ్చినా అడగటానికి మొహమాట పడొద్దని మరీ మరీ చెప్పారు. అప్పడు అలా చెప్పిన వాళ్లే.. తీరా నేను ఇప్పుడు ఆపదలో పడేసరికి మొహం చాటేశారు. నా పరిస్థితి వివరించి.. కొంత డబ్బు అప్పుగా కావాలని అడిగేసరికి, కనీసం నా ఫోన్ కాల్ కూడా ఎత్తడం లేదు. కనీసం నా తల్లిదండ్రులు కానీ, నా అత్తమామలు కాని బతికి ఉంటే.. ఈ రోజున మరీ ఇంతటి దీనస్థితి నాకు వచ్చి ఉండేది కాదేమో! ఓ వైపు నా భార్య బాగోగులు చూసుకుంటూ.. మరోవైపు ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తూ.. డబ్బు కోసం వాళ్ల దగ్గరికి, వీళ్ల దగ్గరికి కాళ్లు అరిగేలా తిరుగుతూ.. నేను పూర్తిగా అలసిపోయాను.. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా.

ఈ పరిస్థితుల్లో.. నేను చేయి చాపగలిగిన వాళ్లు ఈ లోకంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు, నా చిన్నారిని రక్షించుకునే ఈ పోరాటంలో నా ఫండ్ రైజర్ Ketto.org కి విరాళం అందించడం ద్వారా మీరు నాకు తప్పక సాయం చేస్తారని ఆశిస్తున్నాను. నా జీవితంలో మరో అద్భుతం.. మీ ద్వారానే జరగాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X