అమేఠిలో నేనే గెలుస్తా ..స్మృతి ఇరానీ
యూపిలో ఆమేఠీ లోక్‌సభ స్థానం నుండి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి పై పోటి చేస్తున్న స్మృతి ఇరానీ ఖచ్చితంగా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రెండు స్థానాల్లో పోటిచేయాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించడం చరిత్రలో మొదటి సారి అని పేర్కోన్నారు.
ఆమేఠీలో రాహుల్ గాంధికి గెలుపు పై ధీమా లేకపోవడంతోనే వయనాడ్ లో రాహుల్ పోటి చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లుగా రాహుల్ గాంధీ అమేఠీకి రాలేదని ,కనీసం నియోజకవర్గంలో కూడ ప్రచారానికి రావడం లేదని అన్నారు. తాను ఓ సాధరణ కార్యకర్తను అయినప్పటికి మంత్రివర్గంలో పనిచేస్తున్నానని అన్నారు. ఆమే ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడారు.













Click it and Unblock the Notifications