జయలలితకు నేను చికిత్స చెయ్యలేదు: డాక్టర్ స్వామినాథన్: అసలు ఏం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu
  జయలలితకు నేను చికిత్స చెయ్యలేదు ! -డాక్టర్ స్వామినాథన్

  చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి విషయంపై విచారణ చేస్తున్న మద్రాసు హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రతి విషయం బయటకు లాగుతోంది. జయలలితకు ఎవరెవరు చికిత్స చేశారు అనే పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ స్వామినాథన్ జయలలితకు చికిత్స చెయ్యలేదని విచారణలో వెలుగు చూసింది.

  జయలలిత

  జయలలిత

  డాక్టర్ స్వామినాథన్ ప్రముఖ కార్డియాలజిస్ట్. జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 5వ తేదీ రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో మరణించారని అపోలో ఆసుపత్రి ప్రకటించింది.

  డాక్టర్ స్వామినాథన్

  డాక్టర్ స్వామినాథన్

  తమిళనాడులో ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ స్వామినాథన్ జయలలితకు చికిత్స చేశారని, అయితే చికిత్స విఫలం అయ్యి అమ్మ మరణించారని ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. డాక్టర్ స్వామినాథన్ చికిత్స చేశారు అనే ప్రచారం ఎంతో వరకు నిజం అనే విషయం వెలుగు చూడలేదు.

  డాక్టర్ కు సమన్లు

  డాక్టర్ కు సమన్లు

  జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న మద్రాసు హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వామినాథన్ ను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

  ఆ చాన్స్ ఇవ్వలేదు!

  ఆ చాన్స్ ఇవ్వలేదు!

  జయలలితకు చికిత్స చెయ్యడానికి తనకు అనుమతి ఇవ్వలేదని, అసలు ఆమెను తాను ఆసుపత్రిలో చూడనేలేదని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వామినాథన్ జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వివరణ ఇచ్చారు.

  అదే అనుమానం

  అదే అనుమానం

  ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వామినాథన్ తో జయలలితకు ఎందుకు చికిత్స చేయించలేదు ? అసలు ఏమి జరిగింది, అమ్మకు చికిత్స చేసే సమయంలో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు నిర్లక్షం చేశారా ? అనే కోణంలో ఇప్పుడు విచారణ ముమ్మరం అయ్యింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Dr Swaminathan has appeared before Justice Arumugasamy commission today and refuted that he never treated late Jayalalithaa.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి