"ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి... నా భార్య పట్టించుకోదు"
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం తన ఛలోక్తులతో లోక్‌సభలో నవ్వులు పూయించారు. ‘నాకు ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి. అయినా.. నా భార్య అలాంటివి ఏమీ పట్టించుకోదు' అని అన్నారు.
ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్‌పురి గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ‘వెంకయ్యజీ ఐ లవ్ యూ' అని ఓ పాట పాడారు.

దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. మనోజ్ ప్రేమపై తనకేమీ అభ్యంతరం లేదని అన్నారు. లోక్ సభలో వెంకయ్య నాయుడు పార్లమెంటరీ ఎఫైర్స్ మంత్రిగా ఉన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఈ విషయంపై స్పందిస్తూ మీ మనసులో అలాంటి ఆలోచన ఎందుకు ఉందని ప్రశ్నించారు. దీంతో వెంకయ్య నాయుడు నా మనసులో ఎలాంటి ఆలోచన లేదు. నీ మనసులో ఏదైనా ఉంటే దానిని తొలగించండి అని అన్నారు.












Click it and Unblock the Notifications