జైలులో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న శశికళ

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై/బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఆస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

కొత్త ట్విస్ట్: తమిళనాడు సీఎంగా పన్నీరుసెల్వం, పళనికి డిప్యూటీ..?

ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆమె ఉత్సాహంతో అధికారులకు విజ్ఞప్తి చేయగా, తాము పరిశీలిస్తున్నట్లు జైలు అధికారులు చెప్పారు. మరోవైపు, శశికళ జైలులో ఆత్మకథ రాసే పనిలో కూడా ఉన్నారు.

I want to learn English, Sasikala tells jail officials in Bengaluru

ఆమెకు తమిళం బాగా తెలుసు. కానీ ఇంగ్లీష్ అంతగా రాదు. అందుకే జైలులో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జైలు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా, జయలలిత మృతి అనంతరం శశికళ 'అమ్మ'ను అనుసరించే ప్రయత్నాలు చేశారు. జయలలితలా వేషధారణ, హెయిర్ స్టయిల్, విక్టరీ సింబల్.. ఇలా చిన్నమ్మను అనుసరించే ప్రయత్నాలు చేశారు. అంతలోనే జైలుకు వెళ్లారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Politically irrelevant and out of the thick of action, Sasikala Natarajan has decided to pick up a book and learn how to speak English. Lodged in the Bengaluru central jail after being sentenced to four years imprisonment in the disproportionate assets case, Sasikala has requested jail authorities to provide her an English tutor.
Please Wait while comments are loading...