కరాచీలో పుట్టా, కానీ తప్పుడు పనులు చేయొద్దని ఆరెస్సెస్ నేర్పింది: అద్వానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తాను కరాచీలో పుట్టినా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) ద్వారా క్రమశిక్షణ, సంస్కారం నేర్చుకున్నానని బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ అన్నారు. ఆరెస్సెస్ తనకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పిందన్నారు.

తప్పుడు పనులు ప్రోత్సహించకూడదని తాను ఆరెస్సెస్‌లో నేర్చుకున్నానని చెప్పారు. ఆరెస్సెస్‌తో దేశభక్తి, అంకితభావం అలవడిందన్నారు. రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో జరిగిన బ్రహ్మ కుమారీస్‌ 80వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

lk advani

వార్షికోత్సవంలో భాగంగా నాలుగు రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే మౌంట్‌ అబూ చేరుకున్నారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌, పలువురు కేంద్రమంత్రులు, అసోం, గుజరాత్‌ గవర్నర్లు, ఏపీ సీఎం చంద్రబాబు, న్యాయమూర్తులు, పలువురు ఎంపీలు, వ్యాపారవేత్తలు, బాలీవుడ్‌ తారలు రవీనా టాండన్‌, గ్రేసీ సింగ్‌ తదితరులు హాజరుకానున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP veteran leader L.K. Advani on Sunday said he was born in Karachi but learnt discipline and got the education from Rashtriya Swayamsevak Sangh (RSS).
Please Wait while comments are loading...