బాల్యం నుంచే నాకు విపరీతమైన కామవాంఛ: ఉబేర్ క్యాబ్ డ్రైవర్
న్యూఢిల్లీ: 27 ఏళ్ల మహిళపై కారులో అత్యాచారం చేసిన ఉబేర్ కారు డ్రైవర్ శివ కుమార్ యాదవ్ పోలీసు విచారణలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు సమాచారం. పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచే తనకు విపరీతమైన కామాతురత ఉండేదని విచారణలో అతను చెప్పినట్లు ఓ వార్తా సంస్థ కథనం. తన స్వభావమే ఆ విధంగా ఉంటూ వచ్చిందని అతను చెప్పినట్లు సమాచారం.
27 ఏళ్ల శివకుమార్ తన వాంగ్మూలంలో చెప్పిన ఆ విషయాన్ని కూడా పోలీసులు చార్జిషీట్‌లో నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్‌పురిలో జరిగిన 2003లో జరిగిన అసభ్య ప్రవర్తనతోనూ 2013 అత్యాచారం కేసుతోనూ శివకుమార్ యాదవ్‌కు సంబంధం ఉందని పోలీసులు చార్జిషీట్‌లో ఆరోపించారు. ఈ రెండు కేసుల్లోనూ అతను అరెస్టై బెయిల్ తీసుకున్నాడని చెప్పారు.

శివకుమార్ యాదవ్‌ను 2011 అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు నిర్దోషిగా విడుదల చేసిందని గుర్తు చేశారు. కనీసం ఐదు కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. వాటిలో ఉత్తరప్రదేశ్ గూండాల నియంత్రణ చట్టం కింద కూడా ఓ కేసు ఉందని చెప్పారు. డిసెంబర్ 5వ తేదీన తాను చేసిన అత్యాచారం గురించి అతను వివరించినట్లు తెలుస్తోంది.
మహిళ కారు వెనక సీట్లో కూర్చుని నిద్రపోతోందని, అది గమనించిన తనకు దుర్భుద్ధి పుట్టిందని అతను చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దాంతో కారును నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలిపాడని అన్నారు.
జీవించడానికి తాను 1999 నుంచి వ్యవసాయం చేస్తూ వచ్చానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. యాదవ్ 2005లో క్యాబ్ డ్రైవర్‌గహా ఓ కాల్ సెంటర్ కంపెనీలో చేరాడు. ఆ తర్వాత 2014లో స్విఫ్ట్ డిజైర్ కొనుక్కుని దాని ద్వారా ఉబేర్ కంపెనీకి సర్వీసు చేస్తున్నాడు. పోలీసులు అత్యాచారం జరిగిన 19 రోజుల తర్వాత డిసెంబర్ 24వ తేదీన కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications