ఆర్మీలో చేరి మా నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకుంటా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. 9 ఏళ్ల పిల్లాడి శపథం

పాకిస్థాన్ పై భారత్ ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం ఆపరేషన్ సిందూర్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీసింది భారత ఆర్మీ. అత్యాధునిక క్షిపణులతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రమూకలు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. అయితే ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ హతం అయ్యాడు.

ఆపరేషన్ సిందూర్.. భారతీయుల్లో కొత్త జోష్ నింపింది. అందుకు ఈ 9 ఏళ్ల పిల్లాడి మాటలే నిదర్శనం. పహల్గాం ఉగ్రదాడిలో తన తండ్రిని కోల్పోయిన ఆ పిల్లాడు.. తాను పెద్దయ్యాక ఆర్మీలో చేరి.. తన తండ్రిని చంపిన వాడ్ని హతమారుస్తానని శపథం చేశాడు. ఇప్పుడు అతడి మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

I Will Join the Army and Avenge My Father s Death 9-Year-Olds Vow After Operation Sindoor

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన తనుజ్ కుమార్ సత్పతి వయసు 9 ఏళ్లు. ఇటీవల సమ్మర్ ట్రిప్ కని ఆ ఫ్యామిలీ కాశ్మీర్ లోని పహల్గాం వెళ్లింది. అయితే ఇక్కడ ఉగ్రవాదులు జరిపిన దాడిలో తనుజ్ తండ్రి ప్రశాంత్ సత్పతి మరణించారు. ఆ తర్వాత రిపోర్టర్స్ తో మాట్లాడుతూ 9 ఏళ్ల తనుజ్ భావోద్వేగంగా మాట్లాడాడు. తనకు అవకాశం వస్తే ప్రధాని నరేంద్ర మోదీకి ఒక మాట చెప్పాలని.. నాలాగా దేశంలో ఏ ఒక్క చిన్నారి కూడా తండ్రి లేని వాళ్లుగా ఉండొద్దని చెప్తానని అన్నాడు

" ఇండియన్ ఆర్మీలో చేరాలని డిసైడ్ అయ్యాను. మా నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. మా అమ్మ ప్రియదర్శిని మాకు అండగా ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ తో మా కుటుంబంలో సంతృప్తి ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడి నుంచి మా కుటుంబానికి ఆర్మీ అండగా నిలుస్తూ వస్తోంది. అందుకే నేను ఆర్మీలో చేరి మా నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకుంటా. బాగా చదువుతాను. అప్పుడు ఆర్మీలో జాయిన్ కావొచ్చు. మా తండ్రిని కోల్పోయాక ఇప్పుడు నేను గ్రహించాను ఓ తండ్రి బిడ్డకు ఎంత అవసరమో" అని తనుజ్ భావోద్వేగంగా మాట్లాడాడు.

తనుజ్ తల్లి ప్రియదర్శిని మాట్లాడుతూ.. తనుజ్ లక్ష్య సాధన కోసం ఏమైనా చేస్తామని అన్నారు. అతడు ఆర్మీలోకి వెళ్లాలని అనుకుంటే.. ఆ విధంగా ప్రిపేర్ చేస్తాను.. నా బిడ్డకు దేశ ప్రజల దీవెనలు కావాలి అని అన్నారు. ప్రస్తుతం తనుజ్ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+