ఎవరు అవినీతీపరులో తాను వెళ్లేలోపు బయట పెడతా...! గవర్నర్ సత్యపాల్ మాలిక్...
తాను కశ్మీర్ గవర్నర్‌గా వెళ్లిపోయో వరకైనా అందరి బంఢారం బయటపెట్టి వెళతానని జమ్ము ,కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు. గవర్నర్ పదవిలో ఉంటూ రాష్ట్రంలోని అవినీతీపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా స్పందించిన నేషనల్ కాన్ఫరన్స్ అధినేత ఒమర్ అబ్ధుల్లాను కౌంటర్ చేస్తూ సత్యపాల్ మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అవినీతీ నాయకులను చంపేయండి అంటూ చేసిన అవినీతీపై చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలోనే కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్ధుల్లా మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. గవర్నర్ వాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా సీరియస్‌గా స్పందించడంతో ఆయన రాజకీయాల్లో ఓ కుర్రకుంక అంటూ గవర్నర్ పతిస్పందించారు. ఓమర్ అబ్దుల్లా రాజకీయాల్లో ఓ కుర్రకుంక అని,ప్రతి విషయానికి ట్విట్టర్‌లో స్పందిస్తారని విమర్శలు చేశారు. ఈనేపథ్యంలోనే తాను కశ్మీర్ గవర్నర్‌గా వెళ్లే లోపు అందరి బంఢారం బయటపెడతానని అన్నారు.

కశ్మీర్‌ను పాలించిన ఆ రెండు పెద్ద కుటుంబాలకు అపరిమితమైన సంపద లభించిందని అని సత్యపాల్ అన్నారు. ఈనేపథ్యంలోనే మీకు లాగ నాకు సంపద లేదు, నా వెనకాల వారసులు ఎవరు లేరు. రెండు గదుల నుండి ఎంతో కష్టపడి వచ్చాను. నేను తప్పకుండా దిగిపోతాను. నేను ఇక్కడి నుంచి వెళ్లే లోపు అందరి గుట్టు రట్టు చేసే వెళ్తాను అని సత్యపాల్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications