హీరో ఉపేంద్ర కొత్త పార్టీ: ప్రాణంపోయే వరకు ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తా, ఏదో ఉంది!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలో 2018లో జరిగే శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తన పార్టీ అభ్యర్థుల ఎంపికలో బహుబాష నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర బిజీగా ఉన్నారు. కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాల్లో తన కొత్త రాజకీయపార్టీ కేపీజేపీ నుంచి పోటీ చేయిస్తామని ఇప్పటికే హీరో ఉపేంద్ర ప్రకటించారు.

ఈ సందర్బంగా మంగళవారం ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసి గెలువడం, ఓడిపోవడం మన చేతుల్లో లేదని, అది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. నేను ఒకప్పుడు అన్నం లేక ఆకలితో ఉన్న సందర్బాలు ఉన్నాయి. ఇప్పుడు లగ్జరీ జీవితం గడుపుతున్నాను అని ఉపేంద్ర చెప్పారు.

I will trying to My last time actor Upendra talk about his KPJP

నేను ఎన్నో సినిమాలు చేశాను, విదేశాలు తిరిగాను, సొంత రిసార్ట్ ఉంది. అయినా తనును అసంతృప్తి వెంటాడుతోంది, తాను పుట్టింది సినిమాలు చేస్తూ డబ్బు సంపాధించడానికి కాదని, ఏదో చెయ్యాల్సి ఉందని అనిపించింది. అందుకే ప్రజాసేవ చెయ్యాడానికి, మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి వచ్చానని ఉపేంద్ర అన్నారు.

ఎన్నికల్లో విజయం సాధిస్తే మంచిదే, ఒక వేళ ఓడిపోతే ప్రాణంపోయే వరకు గెలువడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని ప్రతి ఎన్నికల్లో ప్రజల్లో తిరుగుతానని ఉపేంద్ర చెప్పారు. మొత్తం మీద ఉపేంద్ర స్థాపించిన కేపీజేపీ పార్టీ నుంచి శాసన సభ ఎన్నికల్లో ఎంత మంది పోటీ చేస్తారు అనే విషయం డిసెంబర్ నెలలో తేలిపోతుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will trying to My last time actor Upendra talk about his KPJP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి