వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదిలో చిక్కుకుపోయారు: హెలికాప్టర్ సాయంతో 19మంది కాపాడిన ఐఏఎఫ్

|
Google Oneindia TeluguNews

ఈటానగర్‌: భారత వైమానిక దళ(ఐఏఎఫ్)అధికారులు.. హెలికాప్టర్ల సహాయంతో ద్వీపంలో చిక్కుకుపోయిన 19మందిని కాపాడారు. అరుణాచల్‌‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సియాంగ్‌ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అక్కడి ఓ ద్వీపంలో 19మంది చిక్కుకుపోయారు. నదిలో ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో నీటి మధ్యలో వారంతా ఉండిపోయారు.

చైనాలో భారీ వర్షాల కారణంగా అక్కడి సాంగ్‌పో నది ఉద్ధృతంగా ప్రవహించడంతో దిగువన ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లోని నదిలోకి విపరీతంగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

IAF choppers rescue 19 stranded on island in Arunachal Pradesh’s swelling Siang

అయితే రోజువారీ వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వారు ఆ ద్వీప ప్రాంతంలో చిక్కుకుపోయారు. నది మధ్యలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో వైమానిక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.

హెలికాప్టర్లను ఉపయోగించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నీటి ఉద్ధృతి కారణంగా పడవల ద్వారా వారిని తీసుకురావడం అసాధ్యమని భావించిన అధికారులు ఐఏఎఫ్‌ను సంప్రదించడంతో వారు వెంటనే స్పందించారు.

English summary
Helicopters of the Indian Air Force (IAF) successfully evacuated 19 persons stranded on an island in the swelling Siang river in Arunachal Pradesh early on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X