కుప్పకూలిన భారత్ వైమానిక దళ జెట్ విమానం
కోల్ కతా: భారత వైమానిక దళానికి చెందిన హాక్ అడ్వాన్సెడ్డ్ ట్రైనర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ గురువారం ప్రమాదానికి గురైయ్యింది. అయితే అదృష్టవశాత్తు ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
గురువారం హాక్ అడ్వాన్సెడ్డ్ ట్రైనర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరింది. అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లోని మిద్నాపూర్ జిల్లాలోని కలైకుందా ప్రాంతంలో జెట్ విమానం కుప్పకూలిపోయింది.

పైలెట్లు ఇద్దరు చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. విషయం తెలుసుకున్న భారత్ వైమానిక దళ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
చెన్నై నుంచి బయలుదేరిన ఏఎన్ -32 విమానం గల్లంతు అయ్యింది. దాని ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో మరో జెట్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలడంతో వైమానిక దళ అధికారులు షాక్ కు గురైనారు.












Click it and Unblock the Notifications