అత్యాచారం కేసు: ఐఎఎస్ అధికారి సస్పెన్షన్

పోలీసుల నుంచి వివరమైన కేసు నివేదిక రాగానే ముఖ్యమంత్రి వసుంధర రాజే రంగంలోకి దిగి సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. అదనపు ప్రధాన కార్యదర్శి (ఎసిఎస్) హోదాలో ఉన్న మొహంతి రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్నారు.
మొహంతీపై ఆరోపణలు చేసిన మహిళ వాంగ్మూలాన్ని మంగళవారంనాడు మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. మొహంతికి సమన్లు జారీ చేసినట్లు, బుధవారం దర్యాప్తు నిమిత్తం తమ ముందు హాజరు కావాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.
ఉచ్చు బిగిస్తూ పోలీసులు వైశాలినగర్‌లోని మొహంతి నివాసంలోనూ న్యూ సంగెనేర్ రోడ్డులోని ఫ్లాట్‌లోనూ సోదాలు నిర్వహించారు. మహిళతో మొహంతి గడిపిన హోటళ్ల రికార్డులను, కాల్ వివరాలను పోలీసులు సేకరించారు.
ఐఎఎస్ పరీక్షలో నెగ్గే విధంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చి తనపై మొహంతి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. న్యూ సంగనేర్‌లోని ఫ్లాట్‌లో మొహంతి మొదటిసారి 2013 ఫిబ్రవరి 19వ తేదీన తనపై అత్యాచారం చేసినట్లు ఆమె తెలిపింది. ఈ ఫ్లాట్‌ను పోలీసులు సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications