వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

1.పళ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే?

మన నోటివరకు చేరేముందే చాలా పళ్లు, కూరగాయలు వృథాగా పోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు నేడు హైటెక్ కోటింగ్స్‌తో మొదలుపెట్టి చాలా పరిష్కారాలు అందుబాటులోకి వస్తున్నాయి. అవేమిటో చూద్దామా...

మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఆహారం లభిస్తున్నప్పటి నుంచీ ఈ సమస్య మనల్ని వేధిస్తోంది. ఆహారం ఎక్కువ ఉన్నప్పుడు, మన బుర్రలోకి వచ్చే మొదటి ప్రశ్న.. ''దీన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవడం ఎలా?''

ఎన్నిరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో.. దీనికి అన్నే రకాల సమాధానాలు కూడా ఉన్నాయి. అంజూర పండ్లను (ఫిగ్స్) ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా చూసేందుకు, మొదట వాటిని గ్రీకులు సముద్రపు నీటిలో కడిగేవారు. ఆ తర్వాత ఎండబెట్టేవారు.

మధ్యయుగంలో చైనాలో నిమ్మకాయలు, నారింజ పళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసేందుకు వ్యాక్స్‌తో పూత పోసేవారు. 15వ శతాబ్దంలో జపాన్‌లోనూ ఇలానే కూరగాయలను సోయా పాలలో ముంచితీసేవారు. దీని వల్ల తేమ శాతం కోల్పోకుండా ఎక్కువ కాలం అవి నిల్వ ఉంటాయని భావించేవారు. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లోనూ కూరగాయలపై కొవ్వు రాసేవారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

2.సురేంద్రన్ పటేల్: భారత్‌లో బీడీలు చుట్టిన వ్యక్తి అమెరికాలో జడ్జి ఎలా అయ్యారు?

భారతీయ సంతతికి చెందిన న్యాయవాది సురేంద్రన్ కే పటేల్ అమెరికా కోర్టులో డిస్ట్రిక్ జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయం భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది.

ఒకప్పుడు భారత్‌లో బీడీలు చుట్టిన వ్యక్తి, అమెరికాలో డిస్ట్రిక్ కోర్టుకు జడ్జిగా ఎలా ఎదిగారు, ఆయన విజయవంతమైన పయనం ఎలా కొనసాగింది అనే దాన్ని బీబీసీ హిందీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషి మనకు వివరించారు.

కేరళకు చెందిన 51 ఏళ్ల సురేంద్రన్ పటేల్ టెక్సస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కంట్రీలో జ్యూడిషియల్ డిస్ట్రిక్ కోర్ట్‌కి 240వ జడ్జిగా నియమితులయ్యారు.

అమెరికా పౌరుడిగా మారిన ఐదేళ్లకు అంటే జనవరి 1న ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. కృషి, పట్టుదల, ఎన్నో కష్టాల ఫలితమే ఇదని పటేల్ తన జీవిత పయనం గురించి వివరించారు.

''ఎంతో మంది వ్యక్తులు నాకు అండగా నిలిచారు. నా జీవితంలో ప్రతి దశలో వారెంతో సాయపడ్డారు'' అని పటేల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ జాబితాలో తన తల్లి మొదటి స్థానంలో ఉన్నట్టు చెప్పారు. త్యాగానికి ప్రతీకగా ఆమెను కొలిచారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

మైక్రోసాఫ్ట్

3.మైక్రోసాఫ్ట్‌లో 10,000 వేల ఉద్యోగాల కోత... ఈ ప్రభావం ఎలా ఉంటుంది?

మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా 10,000 ఉద్యోగాల కోత ప్రకటించింది. ఈ తాజా నిర్ణయం మొత్తంగా టెక్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిపై ఈ కోత ప్రభావం ఉంటుంది. ఉద్యోగుల తొలగింపు, పునర్వ్యవస్థీకరణల కోసం ఈసంస్థ 120 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టనుంది.

కరోనా సమయంలో వినియోగదారుల ఖర్చులు బాగా పెరిగాయని, అయితే ప్రజలు కొనుగోళ్ళ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల అన్నారు.

అయితే, కీలక రంగాల్లో మాత్రం ఉద్యోగ నియామకాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.

ఉద్యోగాల కోత గురించి సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించిన సత్య నాదెళ్ల, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు ప్రస్తుతం మాంద్యంలో లేదా మాంద్యం అంచున ఉన్నాయన్నారు. ఇదే సమయంలో, ఏఐ వృద్ధి చెందడంతో కొత్త తరం కంప్యూటింగ్ వ్యవస్థలు వేగంగా ముందుకు వస్తున్నాయని నాదెళ్ళ వివరించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

4. ఈ దేశంలో చికెన్ కన్నా ఉల్లిపాయల ధర మూడు రెట్లు ఎక్కువ

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వంటల్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది. దాదాపు అన్ని కాయగూర వంటకాల్లో ఉల్లిపాయలు వేసుకుంటారు. మాంసం రేటు ఎక్కువ కాబట్టి, వారానికి ఒకసారో రెండుసార్లో వండుకుంటారు.

కానీ, ఫిలిప్పీన్స్‌లో పరిస్థితి వేరు ఇక్కడ కోడి మాంసం, పశు మాంసం కంటే ఉల్లిపాయల ధరే ఎక్కువగా ఉంది.

1521 నుంచి 1898 మధ్య ఇక్కడ స్పెయిన్ వలస పాలన ఏర్పాటు చేసినప్పటినుంచీ ఉల్లిపాయలు, వెల్లుల్లిలకు ఇక్కడి వంటలతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఫిలిప్పీన్స్ ఆహార అలవాట్లపై స్పెయిన్ చాలా ప్రభావం చూపింది.

అయితే, ఫిలిప్పీన్స్‌లో నెల రోజుల నుంచి ఉల్లిపాయలు అందని ద్రాక్షలా మారిపోయాయి. వీటితోపాటు కొన్ని కూరగాయల ధరలు కూడా చికెన్, బీఫ్‌లను మించిపోయాయి.

ఒక కేజీ ఎర్ర లేదా తెల్ల ఉల్లిపాయల ధర ఇక్కడ 11 డాలర్లకు (రూ.890) పెరిగింది. మరోవైపు చికెన్ మాత్రం రూ.4 డాలర్లకే (రూ.325) దొరకుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

5.సంతాన లేమి: పిల్లలు పుట్టకపోతే సమస్య ఎక్కడో ఎలా తెలుసుకోవాలి?

ఒక సంవత్సరం వైవాహిక జీవితం తరవాత పిల్లలు పుట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, గర్భం దాల్చక పోతే దాన్ని సంతాన లేమి అంటారు.

సంతాన లేమికి, పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన కారణాలు, హార్మోన్లు, ఇన్ఫెక్షన్లు ముఖ్య కారణాలు. అయితే, నేను వైద్యుల భాష వాడి ఇబ్బంది పెట్టను. ఎవరైనా సంతాన లేమితో ఇబ్బంది పడుతుంటే, ఏమి తెలుసుకోవాలి అనే కొన్ని విషయాలు మాత్రమే చర్చిస్తా.

ఒక జంటకు సంతానం కలగకపోతే, ముందుగా దానికి సమస్య పురుషుడి దగ్గర ఉందా, లేదా స్త్రీ వద్దనా అని తెలుసుకోవాలి. పురుషుడి కారణాలు తెలుసుకోవడం చాలా తేలిక. అతని వీర్య పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. మూడు రోజులు శారీరికంగా కలవకుండా ఉండి (abstinence), ఏదైనా పరీక్ష కేంద్రంలో 'semen analysis' పరీక్ష చేస్తే తెలిసిపోతుంది.

అది నార్మల్ ఉంటే, దాదాపు సగం సమస్య లేనట్టే. కానీ అందులో ఏమైనా సమస్య ఉంటే, అది కణాల ఉత్పత్తిలోనా, ఆయుష్షులోనా, వేగంలోనా, లేదా ఏదైనా వ్యాధి లేక ఇన్ఫెక్షన్ వల్లనా అని తగిన పరీక్షలు జరిపి తెలుసుకొని, దానికి తగ్గ చికిత్స తీసుకోవచ్చు.

సమస్య పురుషుడిలో లేదు అని తెలిసాక, స్త్రీ సంబంధిత కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూడాలి. పూర్తి కథనం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
ICYMI: This week's must-read articles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X