ICYMI: కైలాస సహాఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలు ఇవే

ఉద్ధానం కిడ్నీ బాధితులు

1. ఖర్చులు భరించలేక నాటు మందులను ఆశ్రయిస్తున్న ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు

కోనసీమను తలపించే ఉద్దానంలో ఎందుకు వస్తుందో కారణం తెలియని కిడ్నీ వ్యాధి వేలాది మందిని జీవచ్ఛవాలుగా మార్చేస్తుంది.

దశాబ్దాలు గడుస్తున్నా ఉద్దానం కిడ్నీ బాధితులకు వ్యాధి విషయంలో ఊరట లభించడం లేదు.

ఉద్దానంలో గత ఐదేళ్లుగా బీబీసీ బృందం, ఏటా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ, ఆ సమాచారాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వస్తోంది.

ఈ ఏడాది, వలస కూలీలు ఎక్కువగా ఉండే కవిటి మండలంలోని సహలాల పుట్టుగ గ్రామంలో బీబీసీ పర్యటించింది.

సుమారు 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 15 మంది కిడ్నీ వ్యాధి బాధితులున్నారు.

గత రెండేళ్లలో (2012, 2022) ఈ గ్రామం నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఒక్కరు కూడా వెళ్లలేదు.

ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధిత గ్రామాలున్న ప్రధాన ఏడు మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురంలలో మండలాల్లోని 23 కేంద్రాలలో కిడ్నీ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

నవాబ్ సుల్తాన్ జహాన్ బేగమ్

2. భోపాల్ సంస్థానాన్ని 107 ఏళ్లు పాలించిన బేగమ్‌ల కథ

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న మహిళా శక్తి గురించి, సమాజానికి వారు అందిస్తున్న సహకారం గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుపుతుంది.

ఒకసారి భోపాల్ సంస్థానం చరిత్రలోకి వెళ్లి చూస్తే దాన్ని పాలించిన మహిళల గొప్పతనం గురించి తెలుసుకోవచ్చు. అక్కడ పురుషులు కూడా సులభంగా చేయలేని పనులన్నింటినీ మహిళా పాలకులు చేసి చూపించారు.

ఫతేఘఢ్ కోటను నిర్మించడం ద్వారా సర్దార్ దోస్త్ మొహమ్మద్ ఖాన్, భోపాల్ సంస్థానానికి పునాది వేశారు.

కానీ, ఆ సంస్థానానికి గుర్తింపు తెచ్చింది మాత్రం అక్కడి బేగమ్ నవాబులే.

బేగమ్‌ల పాలన కుద్సియా బేగమ్‌తో మొదలైంది. సికిందర్ జహాన్ బేగమ్ నుంచి సుల్తాన్ జహాన్ బేగమ్ వరకు మొత్తం 107 ఏళ్ల పాటు వీరి పాలన కొనసాగింది.

1819 నుంచి 1926 వరకు భోపాల్ సంస్థానం పాలన బేగమ్‌ల చేతుల్లోనే ఉంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

3. నిత్యానంద 'కైలాస'లా సొంత దేశం ఉండాలంటే...

భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద తాను ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. దానికి కైలాస అని పేరు పెట్టుకున్నారు.

ఈ కైలాస దేశానికి ప్రతినిధినంటూ ఇటీవల ఒకామె ఐక్యారాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. చివరకు ఆ సమావేశాల నుంచి కైలాస ప్రతినిధి ప్రసంగాన్ని తొలగిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

ఆ వివాదాన్ని పక్కన పెడితే మన కంటూ ఒక దేశం లేదా రాజ్యం ఉండొచ్చా? అంటే ఉండొచ్చు. ఇప్పటికే కొందరు నిత్యానంద మాదిరిగానే సొంత దేశాలను ప్రకటించుకున్న వారు ఉన్నారు.

'నా కంటూ ఒక దేశం... దానికి నేనే రాజు, నేనే మంత్రి'... ఇలా కలలు కనేవాళ్లు ఉన్నారు. అలా కన్న కలలను సాకారం చేసుకున్నామని చెబుతున్న వాళ్లు కూడా ఉన్నారు.

దేశం అనగానే ముందుగా మీకు కొంత భూమి ఉండాలి. లక్షల, కోట్ల ఎకరాలు కాక పోయినా ఒక్క ఎకరా ఉన్నా సరే దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

కాకపోతే అది ఈ ప్రపంచంలో ఏ దేశం అధీనంలో లేని భూమి అయి ఉండాలి. అక్కడ మీ జెండాను పాతి ఇది నా దేశం అని చెప్పుకోవచ్చు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

4. కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా?

భారత్‌లో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు దశాబ్దాలలో మూత్ర పిండాల సంబంధిత రోగులు రెట్టింపు అయ్యారు.

దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వారు రెండు లక్షలు ఉండగా, ప్రతి సంవత్సరం కేవలం 12 వేల మూత్ర పిండ మార్పిడులు అవుతున్నాయి. ఈ లెక్కలన్నీ మూత్ర పిండాల ఆరోగ్య సమస్య తీవ్రతను తెలియజేస్తాయి. అయితే ఈ కిడ్నీ వ్యాధి సమస్య తగ్గించడం కోసం, వ్యాధికి గల కారణాలు, తీవ్రత తగ్గించడానికి అవసరమైన అవగాహన గురించి ఇప్పుడు చూద్దాం.

కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం అదుపులో లేని మధుమేహం. అది కాక, అధిక రక్తపోటు, కొన్ని సార్లు బీ.పీ తగ్గిపోవడం వల్ల, ఎన్నో ఇతర ఇన్ఫెక్షన్లు ( డెంగూ, మలేరియా, హెచ్‌ఐవీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు), మూత్ర పిండాల రాళ్లు, కొన్ని రకాల మందుల (నొప్పి తగ్గడానికి వాడే మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు, కొన్ని యాంటీబయాటిక్స్) వల్ల ఈ సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా, మోతాదు తెలియని వాళ్లు ఇచ్చే పసరు మందులు, చెట్ల మందుల వల్ల, కొన్ని సార్లు జన్యు పరమైన సమస్యల కారణంగా, లూపస్ (SLE) వంటి కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు (మహిళల్లో అధికంగా) మూత్ర పిండాలు పాడవడానికి కారణం అవ్వవచ్చును.

పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

5. కొరియన్ సీరియళ్లు బాలీవుడ్‌ సినిమాలను మరపిస్తున్నాయా?

ఒక ప్రమాదం కారణంగా ఒక యువతి శత్రుదేశంలో చిక్కుకుంటుంది. అక్కడ అందగాడైన ఒక ఆర్మీ ఆఫీసర్ ఆమెను కాపాడతాడు.

వారిద్దరూ ప్రేమలో పడతారు. కానీ, వారిద్దరూ కలిసి ఉండాలంటే, ముందు వారి దేశాలను విభజించే రేఖతో సహా అనేక అడ్డంకులను దాటాల్సి ఉంటుంది.

మీరు ఈ కథను కొన్నేళ్ల క్రితం ఒక భారతీయునికి వివరించినట్లయితే, వారికి వెంటనే 2004లో వచ్చిన బాలీవుడ్ చిత్రం వీర్‌ జారా గుర్తుకు వస్తుంది.

ఈ చిత్రంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ప్రేమికులుగా షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా నటించారు.

ఇదే కథాంశంతో 2019లో క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ (సీఎల్ఓవై) అనే కొరియన్ డ్రామా వచ్చింది. పొరుగు శత్రుదేశాలైన దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల నేపథ్యంలో ఈ డ్రామా నడుస్తుంది.

భారత్‌లో కె-డ్రామాలు ఎంత ప్రజాదరణ పొందుతున్నాయో ఈ పాడ్‌కాస్ట్ వివరిస్తుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+