వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాల జాబితా ఇదే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గౌతమ్ అదానీ

1.గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్‌లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు?

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.

అదానీ గ్రూపు 'స్టాక్ మానిప్యులేషన్', అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని ఇటీవల అమెరికా ఇన్వెస్టిమెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఒక నివేదిక విడుదల చేయడంతో, అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనం అవుతున్నాయి.

ఆ నివేదికకు ముందు ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదో స్థానంలో ఉండే అదానీ ప్రస్తుతం 15వ స్థానానికి పడిపోయారు.

అయితే, గతంలోనూ ఇలాంటి కొన్ని చేదు అనుభవాలను తను ఎదుర్కొన్నట్లు ఒక ప్రైవేటు మీడియా చానెల్‌తో ఇటీవల అదానీ చెప్పారు.

అలాంటి అనుభవాలను మరచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని ఈ ఇంటర్వ్యూలో అదానీ వ్యాఖ్యానించారు.

ఆయన చెప్పిన రెండు ఘటనల్లో ఒకటి 2008 నవంబరు 26 నాటి ముంబయి దాడులు. ఆ దాడుల సమయంలో అదానీ.. తాజ్ హోటల్‌లోనే ఉన్నారు. ఆ హోటల్‌లో విడిదిచేసిన వారు కూడా ఆనాడు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఇక రెండో ఘటన గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది 1998లో జరిగింది. తుపాకీ గురిపెట్టి ఆనాడు అదానీని కొందరు కిడ్నాప్ చేశారు. రూ. 15 కోట్లు ఇస్తేనే విడిచిపెడతామని ఆనాడు ఆయన్ను బెదిరించారు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కల్పనా చావ్లా ( మధ్యలో)

2.కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా?

2003 ఫిబ్రవరి 1. అంతరిక్షయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం చోటు చేసుకున్న రోజు.

అంతరిక్షం నుంచి తిరిగి భూమికి చేరుకునే క్రమంలో గాలిలోనే కాలిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్.

భారత్‌కు చెందిన కల్పనా చావ్లాతో సహా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఆ ప్రమాదంలో చనిపోయారు.

ఆ రోజు ఏం జరిగింది?

16 రోజులపాటు అంతరిక్షంలో గడిపాక 2003 ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో మళ్లీ భూమికి పయనమైంది కల్పనా చావ్లా బృందం. బయలుదేరే ముందు స్పేస్ క్రాఫ్ట్‌కు సంబంధించి ఆస్ట్రోనాట్స్ చేసిన భద్రతా పరీక్షల్లో అంతా సవ్యంగానే కనిపించింది.

భూమికి సుమారు 282 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. భారత కాలమానం ప్రకారం అప్పుడు సమయం సాయంత్రం సుమారు 6 గంటల 40 నిమిషాలు అవుతోంది. భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు.. అంటే భూమి వాతావరణంలోకి ప్రవేశించింది స్పేస్ క్రాఫ్ట్.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దళితులకు పథకం

3.ద‌ళిత గ్రామాల‌కు రూ.21 లక్షలు ఇచ్చే ఈ ప‌థ‌కం గురించి తెలుసా?

దేశంలో షెడ్యూలు కులాలు ఎక్కువగా ఉన్న గ్రామాలు, పంచాయ‌తీలను ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్ద‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్రైమ్ మినిస్ట‌ర్ ఆద‌ర్శ్ గ్రామ్ యోజ‌న ప‌థ‌కాన్ని (PRIME MINISTER ADARSH GRAM YOJANA - PMAGY) అమ‌లు చేస్తోంద‌నే విష‌యం మీకు తెలుసా?

ఈ ప‌థ‌కం కింద ఒక్కో ద‌ళిత గ్రామానికి రూ.21 ల‌క్ష‌ల నిధులతో ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప‌నులు చేప‌డుతోంది కేంద్ర ప్రభుత్వం.

విద్య‌, వైద్యం, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌తోపాటు ఆయా గ్రామాల్లోని యువ‌త‌కు ఉపాధి శిక్ష‌ణ ఇచ్చి వారి ఆర్థిక స్వావ‌లంబనకు తోడ్పాటు అందించే ప‌థకం ఈ పీఎంఏజీవై.

ఈ ప‌థ‌కం ఏమిటి, దీన్ని గ్రామాలు ఎలా ఉప‌యోగించుకోవాలి? ఎంపిక ప్ర‌క్రియ ఎలా ఉంటుంది? ఎలా అమ‌లు చేస్తారు? ద‌ళిత గ్రామాల్లోని ప్ర‌జ‌లు ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకోవ‌డం ఎలా?

త‌దిత‌ర వివ‌రాల‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4.శిశువులు భారీగా బరువు పెరగడానికి కారణాలేంటి?

ఒక మహిళ ఇటీవల 59 సెంటిమీటర్ల పొడవుతో 7.3 కేజీల బరువున్న బిడ్డకు జన్మనిచ్చింది.

బ్రెజిల్ అమెజాన్‌లో ఉన్న పరింటిన్స్‌లోని పాద్రే కోలంబో ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈ డెలివరీ చేశారు. ఆ బిడ్డకు యాంగర్‌సన్ శాంటోస్ అని నామకరణం చేశారు.

1955లో ఇటలీలో ఒక బిడ్డ 10.2 కేజీలతో పుట్టింది. అత్యంత బరువైన శిశు జననాల్లో ఇప్పటివరకు అదే రికార్డు.

సాధారణంగా నవజాత శిశువుల బరువు సగటున మగపిల్లాడు అయితే 3.3 కేజీలు, ఆడపిల్ల అయితే 3.2 కేజీలు ఉంటుంది.

అంతకన్నా చాలా ఎక్కువ బరువుతో పుట్టే భారీ శిశువులను మాక్రోసోమియా (గ్రీకు భాషలో పెద్ద శరీరం అని అర్థం) అని పిలుస్తుంటారు.

4 కేజీల కంటే ఎక్కువ బరువుతో పుట్టే ఏ శిశువునైనా గర్బధారణ వయసుతో సంబంధం లేకుండా మాక్రోసోమిక్ బేబిగా పరిగణిస్తారు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సున్తీ వల్ల సామర్థ్యం పెరుగుతుందా.

5.సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా?

సున్తీ అనేది ఒక శస్త్రచికిత్స. దీన్ని వేల ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.

ఈజిప్టులో వేల ఏళ్లకు ముందు నుంచి సున్తీ నిర్వహించేవారని చరిత్రకారులు భావిస్తున్నారు. నేటికీ చాలా ప్రాంతాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరికి సున్తీ జరుగుతోంది.

ఈ చికిత్సలో భాగంగా పురుషాంగం ముందుండే చర్మాన్ని తొలగిస్తారు. ఎక్కువగా ముస్లింలలో పుట్టినప్పుడే సున్తీ చేస్తారు.

ఆ తర్వాతి స్థానంలో అమెరికా వాసులు ఉంటారు. ఇక్కడ జన్మించిన పురుషుల్లోనూ దాదాపు 80.5 శాతం మందికి ఈ చికిత్స నిర్వహిస్తున్నట్లు 2016నాటి డేటా చెబుతోంది. ఈ చికిత్సతో చాలా ప్రయోజనాలు ఉంటాయని ఇక్కడ దశాబ్దాల నుంచి ప్రజలు భావిస్తున్నారు.

సాధారణంగా సున్తీని బాల్యంలోనే చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఆరోగ్యపరమైన కారణాలతో కాస్త పెద్దయ్యాక కూడా దీన్ని చేయించుకుంటారు.

సున్తీపై ప్రశ్నలకు సైన్స్ ఇస్తున్న నాలుగు సమాధానాలు ఏంటి.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
ICYMI-this-week-s-must-read-articles list was here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X