హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Idols: గుడ్ న్యూస్, 10 పురాతన విగ్రహాలు తమిళనాడుకు అప్పగించిన కేంద్రం, క్రెడిట్ మొత్తం మోదీకే, మంత్రి రెడ్డి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: దేవాలయాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే టక్కున చెప్పే పేరు తమిళనాడు. తమిళనాడులోని అనేక జిల్లాల్లోని నగరాలు, పట్టణాలకు టెంపుల్ టౌన్ అనే పేరు ఉంది. తమిళనాడులో 1960 నుంచి 2008 మధ్య కాలంలో కొన్ని వందల పురాతన విగ్రహాలు చోరీ అయ్యాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉన్న పురాతన విగ్రహాలను చోరీ చేసిన స్మగ్లర్లు వాటిని విదేశీయులకు విక్రయించారు. ఇప్పటికీ స్మగ్లర్లు పురాతన విగ్రహాల మీద కన్ను వేస్తూనే ఉన్నారు. 15, 16వ శతాభ్దంలో చోరీకి గురైన విగ్రహాలను విదేశాల నుంచి భారత్ కు తెప్పించిన కేంద్ర ప్రభుత్వం వాటిని తమిళనాడుకు అప్పగించింది. ప్రజలు ఎంతో నమ్మకంతో, భక్తిశ్రద్దలతో పూజించే విగ్రహాలు చోరీ కావడంతో గతంలో భక్తులు కలతచెందారు. ఇదే సమయంలో చోరీకి గురైన విగ్రహాలు, విలువను లెక్కకట్టలేని విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడంతో ప్రజలు సంతోషిస్తున్నారు.

Delivery boy: వీడి పని ఏంది ?, వీడు చేస్తున్నది ఏమిటి ?, అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్ !Delivery boy: వీడి పని ఏంది ?, వీడు చేస్తున్నది ఏమిటి ?, అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్ !

వందల విగ్రహాలు చోరీ

వందల విగ్రహాలు చోరీ

తమిళనాడులోని అనేక జిల్లాల్లోని నగరాలు, పట్టణాలకు టెంపుల్ టౌన్ అనే పేరు ఉంది. తమిళనాడులో 1960 నుంచి 2008 మధ్య కాలంలో కొన్ని వందల పురాతన విగ్రహాలు చోరీ అయ్యాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉన్న పురాతన విగ్రహాలను చోరీ చేసిన స్మగ్లర్లు వాటిని విదేశీయులకు విక్రయించారు. పురాతన విగ్రహాలు విదేశీయులను విక్రయిస్తున్న స్మగ్లర్లు కోట్ల రూపాయలు సంపాధిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 అమెరికా, ఆస్ట్రేలియాలో విగ్రహాలు

అమెరికా, ఆస్ట్రేలియాలో విగ్రహాలు

తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల్లో ఉన్న పురాతన విగ్రహాలను చోరీ చేసిన స్మగ్లర్లు వాటిని విదేశీయులకు విక్రయించారు. ఇప్పటికీ స్మగ్లర్లు పురాతన విగ్రహాల మీద కన్ను వేస్తూనే ఉన్నారు. 15, 16వ శతాభ్దంలో చోరీకి గురైన విగ్రహాలు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

విదేశాల్లోని మ్యూజియంలో విగ్రహాలు

విదేశాల్లోని మ్యూజియంలో విగ్రహాలు

విదేశాల్లో ఉన్న పురాతన విగ్రహాలు భారత్ కు తిరిగి తెప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో అమెరికాలోని న్యూయార్క్ లోని ఆసియా సొసైటీ మ్యూజియంలో ఉన్న శివుని కాంస్య విగ్రహం, ఇండియానా మ్యూజియంలో ఉన్న తంజావూరులో చోరీకి గురైన వాన్మింగస్వామి, పార్వతి దేవి విగ్రహాలు, నాలుగు చేతుల విష్ణువు విగ్రహాలు, శ్రీదేవి విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం భారత్ కు తీసుకు వచ్చింది.

10 పురాతన విగ్రహాలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం

10 పురాతన విగ్రహాలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం

తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో చోరీకి గురై న్యూయార్క్ మ్యూజియంలో ఉన్న నాలుగు చేతుల విష్ణువు విగ్రహాలు, శ్రీదేవి విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం భారత్ కు తీసుకు వచ్చింది. మొత్తం 8 కాంస్యం, రెండు పురాతన రాతి విగ్రహాలను భారత్ తీసుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటిని తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబుకు అప్పగించారు.

ప్రధాని నరేంద్ర మోదీకి మొత్తం క్రెడిట్

ప్రధాని నరేంద్ర మోదీకి మొత్తం క్రెడిట్

తమిళనాడు ప్రభుత్వానికి విగ్రహాలు అప్పగించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవడం వలనే విదేశాల్లో ఉన్న పురాతన విగ్రహాలను భారత్ తీసుకురావడానికి అవకాశం చిక్కిందని, ఈ క్రెడిట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకే చెందుతుందని కేంద్ర మంత్రి కిసన్ రెడ్డి అన్నారు.

English summary
Idols: Ten idols dating back to the 10th Century CE that were stolen from Tamil Nadu temples, starting from the 1960s till 2008.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X