• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపరిచితుడికి లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్‌తో పొడిచి హత్య చేశాడా, ముదిగొండ పోలీసులు ఏమంటున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మృతుని బంధువులు

తెలంగాణాలోని ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైక్ పై వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి, వెనక కూర్చున్న వ్యక్తి ఇంజెక్షన్ తో పొడిచి చంపేశారంటూ ఫిర్యాదు వచ్చింది.

ఘటనా స్థలంలో నీడిల్‌తో పాటుగా అనుమానాస్పద ఇంజెక్షన్ సంబంధిత వస్తువులు కనిపించడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మృతుడి బంధువులు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ముదిగొండ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెం. 264/2022 గా కేసు నమోదయింది. మృతుడికి పోస్ట్ మార్టమ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

ముదిగొండ ఎస్ ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్పత్రి

చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ చేతివృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఆయన వయసు 51 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో జగ్గయ్యపేట సమీపంలోని గండ్రాయిలో బంధువుల ఇంటికి వెళుతుండగా వల్లభి సమీపంలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగారు. దాంతో తన బైక్ ఆపి జమాల్ ఆయనను ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లేసరికి తనకు ఇంజక్షన్ ఇచ్చినట్టు అనుమానం రావడంతో బైక్ ఆపాడు. ఆ వెంటనే వెనుక ఉన్న అపరిచితుడు బైక్ దిగి పారిపోయాడు.

జమాల్ ఈ విషయాన్ని ఫోన్లో తన భార్యకు తెలియజేశాడు. సోమవారం ఉదయం 9.20 నిమిషాల సమయంలో ఇది జరిగింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే అదే ప్రదేశంలో జమాల్ స్పృహ తప్పిపడిపోయాడు. అతన్ని గమనించిన కొందరు స్థానికులు 108కి ఫోన్ చేసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందిస్తుండగా ఆస్పత్రిలో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

"ఆస్పత్రిలో మరణించిన జమాల్ మృతి పై పలు అనుమానాలున్నాయి. మాకు ఫిర్యాదు అందగానే ఘటనా స్థలానికి వెళ్లాము. అక్కడ ఇంజక్షన్ బాటిల్, సూది కూడా పడి ఉన్నాయి. దాంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాము. దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా వాస్తవాలు కనుక్కుంటాం" అని ఎస్ నాగరాజు బీబీసీకి తెలిపారు.

'ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు’

మృతుడి అల్లుడు ముదిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంజక్షన్ ఇచ్చి చంపేశారని ఆరోపించారు. విచారణ చేసి అగంతకులను పట్టుకోవాలని కోరారు.

"మకు ఎవరితోనూ విబేధాలు లేవు. ఆయనను హత్య చేశారు. ఏం జరిగిందో తెలియడం లేదు. మా అత్తను తన ఇంటికి తీసుకెళ్లడం కోసం మా ఇంటికి వస్తున్నారు. దారిలో ఇలా జరిగింది. ఫోన్లో కూడా ఆయన పూర్తిగా చెప్పలేకపోయారు. ఏం జరిగిందో అని కంగారుతో బయలుదేరి వచ్చేసరికి ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. ఇదంతా అనుమానంగా ఉంది" అంటూ ఫిర్యాదుదారుడు నజీర్ పేర్కొన్నారు.

జమాల్‌ను హత్య చేశారని, మృతులను శిక్షించాలని కోరారు.

ఇలా ఎన్నడూ లేదు...

"ముదిగొండ నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్లే రోడ్డులో ఎప్పుడూ వాహనాల రాకపోకలు ఉంటాయి. అందులోనూ ఉదయం పూట కొంత రద్దీ ఉంటుంది. అలాంటి సమయంలో లిఫ్ట్ అడిగి, బైక్ ఎక్కిన వ్యక్తే ఇంజక్షన్ తో చంపేశారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటిది మా ఏరియాలో ఎప్పుడూ లేదు. గతంలో ఈ రీతిలో హత్యలు కూడా జరిగిన దాఖలాలు లేవు. అసలేం జరిగిందన్నది పోలీసులకు కూడా అంతుపట్టడం లేదు. విచారణ చేస్తున్నారు. పోస్ట్ మార్టమ్ లో ఏమయినా ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి" అంటూ ముదిగొండకు చెందిన జర్నలిస్ట్ పి లక్ష్మణ్ అన్నారు.

సాధారణ జీవితం గడుపుతున్న జమాల్‌‌ను హత్య చేసేటంత పెద్ద వివాదాలు కూడా లేవని బంధవులు తెలిపినట్టు లక్ష్మణ్ బీబీసీతో అన్నారు. ఈ కేసు మాత్రం చర్చనీయాంశంగా మారిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
If he gave a lift to a stranger, he stabbed him to death with an injection, what do the Mudigonda police say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X