బీజేపీలో ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు.. రాజకీయాల్లోకి వస్తున్నా : రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంతో తన అనుబంధమే తాను ఎదుర్కొంటున్న రాజకీయ దాడులకు కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రజల కోసం పోరాడే కుటుంబానికి నేను చెందిన వాడిని. అందుకే బీజేపీ ఎప్పటికప్పుడు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటోంది" అంటూ విమర్శల వర్షం కురిపించారు.

ఈడీ విచారణలో రెండో రోజు హాజరైన వాద్రా, మీడియాతో మాట్లాడారు. "బీజేపీ మాపై ఎంత దాడి చేస్తే, అంత బలంగా ముందుకు సాగుతాం. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం" అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Political Heat Rises as Vadra Slams ED Inquiry

ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే వారిపై ఒత్తిడి తెచ్చేందుకు వాటిని దుర్వినియోగం చేస్తుండటంతో ఇక ప్రజలు ఆ సంస్థలను విశ్వసించరని అభిప్రాయం వ్యక్తం చేశారు.. నేను బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది" అని ఆయన వ్యాఖ్యానించారు.

తన రాజకీయాల్లోకి ప్రవేశం సమీపమేనని వాద్రా క్లారిటీ ఇచ్చారు. "ప్రజలు నా వెంటే ఉన్నారు.ప్రజలు తన వెంటే ఉన్నారని, వారు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని వాద్రా ప్రకటించారు. "ప్రజలు నాతో ఉన్నారు. వారు నేను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు" అని ఆయన అన్నారు. త్వరలోనే రాజకీయాల్లోకి రావడంపై ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

హర్యానాలో భూ కుంభకోణం కేసులో వాద్రాపై ఈడీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాద్రా కంపెనీ 2008లో 3.5 ఎకరాల భూమిని రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసి, తర్వాత అదే భూమిని రూ. 58 కోట్లకు డీఎల్‌ఎఫ్‌కు విక్రయించింది. ఈ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగింది అన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఈడీ విచారణలో అడుగుతున్న ప్రశ్నలకు 2019లోనే సమాధానాలు ఇచ్చానని వాద్రా తెలిపారు. మళ్లీ ఇప్పుడు అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. హర్యానా ప్రభుత్వం తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని వాద్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+