వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేన సర్కార్ మెడకు సుశాంత్ సింగ్ డెత్ కేస్: తమ చుట్టూ ట్రాప్: సీబీఐని నమ్మలేం: రౌత్

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అనూహ్య ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కోణం.. సీబీఐ దర్యాప్తుతోనే వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలెబ్రిటీలు విచారణను ఎదుర్కోవడానికి కారణమైంది. డ్రగ్స్ కోణం వెలుగు చూసిన తరువాత.. ఈ కేసుపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు విచారణను మరింత ముమ్మరం చేశారు. ఇది అక్కడితో ఆగేలా లేదు. క్రమంగా రాజకీయ దుమారాన్ని రేపే అవకాశాలు లేకపోలేదు.

పీసీసీ అధ్యక్షుడికి షాక్: సీబీఐ మెరుపుదాడి: మోడీకి చేతనైంది అదొక్కటేనంటూ: తెల్లవారుజాము నుంచేపీసీసీ అధ్యక్షుడికి షాక్: సీబీఐ మెరుపుదాడి: మోడీకి చేతనైంది అదొక్కటేనంటూ: తెల్లవారుజాము నుంచే

శివసేన సర్కార్‌ చుట్టూ ఉచ్చు..

తాజాగా శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు వ్యవహారం క్రమంగా రాజకీయ రంగును పులముకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన మరణించిన ఉదంతాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నాలు చాపకింద నీరులా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో అధికారంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి, ముంబై పోలీసులకు చెడ్డపేరు తీసుకొచ్చేలా రాజకీయ కుట్ర పన్నుతున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

సంజయ్ రౌత్ ఏం చెబుతున్నారు?

శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఈ అనుమానాలను లేవనెత్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకుని రావడానికి కుట్ర సాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ డెత్ కేసును ఛేదించడంలో ముంబై పోలీసులు విఫలం అయ్యారనే చెడ్డపేరును తీసుకుని రావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది త్వరలోనే తేల్చుతామనీ సంజయ్ రౌత్ చెప్పారు. అదే నిజమైతే.. ఇక సీబీఐ దర్యాప్తును కూడా ఏ మాత్రం నమ్మలేమని తేల్చి చెప్పారు.

రాజకీయాలతో సంబంధం లేదంటూ..

రాజకీయాలతో సంబంధం లేదంటూ..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఎలాంటి రాజకీయ పరిచయాలు లేవనే విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. శివసేనతోనూ ఆయనకు సంబంధం లేదని చెప్పారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసులో అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్త (ఎయిమ్స్) ఫోరెన్సిక్ మెడికల్ బోర్డు చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా సైతం ఇదే విషయాన్ని వెల్లడించారని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. ఆయన నివేదిక ప్రకారం చూసుకుంటే.. సుశాంత్ సింగ్‌ డెత్ కేసులో రాజకీయ ప్రమేయం లేదనే విషయం స్పష్టమైందని అన్నారు.

Recommended Video

#BharatBandh : 29 వరకూ రైల్ రోకో, రైతు నిరసనలు,నినాదాలతో దద్దరిల్లిన రాష్ట్రాలు ! || Oneindia
 సుధీర్ గుప్తా వ్యాఖ్యలపై

సుధీర్ గుప్తా వ్యాఖ్యలపై

అయినప్పటికీ.. ఈ డెత్ కేస్ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించే కుట్రకు కొందరు తెర తీశారని ఆరోపించారు. సుధీర్ గుప్తా చేసిన ప్రకటనల మధ్య నెలకొన్న తేడాను సంజయ్ రౌత్ పరోక్షంగా ఉటంకించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తోన్న రూమ్‌లో క్రైమ్ సీన్‌‌ను నాశనం చేశారని, ఫలితంగా కొన్ని ఆధారాలు కోల్పోయినట్టయిందని, ఆ ఆధారాలను ఎందుకు సేకరించలేకపోయారంటూ సుధీర్ గుప్తా చేసిన వ్యాఖ్యలు ముంబై పోలీసుల పనితీరుపై అనుమానాలు లేవనెత్తేదిగా ఉందని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తును కూడా నమ్మలేమని ఆయన తేల్చి చెప్పారు.

English summary
In Sushant Singh Rajput Death Case, there has been a conspiracy to malign Maharashtra govt and Mumbai Police. If now CBI inquiry is also not being trusted, then we're speechless, Shiv Sena leader Sanjay Raut said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X