బుల్లెట్లు కూడా లెక్కించం: పాక్‌కు రాజ్ హెచ్చరిక
ఢిల్లీ: పాకిస్తాన్‌కు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం నాడు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ కాల్పులకు దిగితే.. తాము బుల్లెట్లను లెక్కించకుండా ఎదురు దాడికి దిగుతామని చెప్పారు. సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్ వైఖరిపై ఆయన విరుచుకుపడ్డారు.
భారత్ ఎన్నడూ పాకిస్థాన్ పైన తొలి బులెట్‌ను కాల్చదన్నారు. పాకిస్తాన్ నుంచి ఒక్క బులెట్ వచ్చినా భారత్ అందుకు తగ్గ సమాధానం చెబుతుందన్నారు. కాల్చే బులెట్ల సంఖ్యను కూడా లెక్కించకుండా విరుచుకుపడతామన్నారు. ఉత్తరాఖండులోని ఖతిమాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

పఠాన్‌కోట్ దాడి అనుమానితుల అరెస్ట్!
పఠాన్‌కోట్ పైన జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ముగ్గురు అనుమానిత సూత్రధారులను పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్లుగా స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ పైన దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించి పాకిస్తాన్ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేసి శనివారం నాడు తీవ్రవాద వ్యతిరేక కోర్టు-2లో హాజరు పరిచినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆయన ఆరు రోజుల రిమాండును విధించారని స్థానిక పత్రికలు వెల్లడించాయి. ఖలీద్ మహమూద్, ఇస్రాదుల్ హక్, మహమ్మద్ షోయబ్ లను సీటీడీ (కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్) అధికారులు లాహోర్‌కు 70 కి.మీ. దూరంలోని ఓ నివాసంలో అరెస్ట్ చేశారట.












Click it and Unblock the Notifications