వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీయే కూటమి గెలిచినా నితీష్ కు తిప్పలు తప్పవా ? సీఎంగా అవకాశం ఇచ్చినా చుక్కలేనా ?

|
Google Oneindia TeluguNews

బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత ఎన్డీఏ విజయం సాధిస్తే సీఎంగా నితీష్ కుమార్ కే అవకాశం ఇస్తారా? లేదా కొత్త వ్యక్తిని తెరమీదకు తీసుకు వస్తారా? ఎన్నికల భాగస్వామ్యం లో భాగంగా ఎక్కువ స్థానాలు ఎవరికి వస్తే, వారిదే హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి బిజెపి హవా కొనసాగుతోంది. దీంతో బీజేపీ, జేడీయూ నేత నితీష్ కుమార్ ని కొనసాగిస్తుందా? లేక కొత్తవారిని తెరమీదకు తీసుకు వచ్చి నితీష్ కుమార్ కు చెక్ పెడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవేళ నితీష్ కే అవకాశం ఇచ్చినా ఆయన చుక్కలే ,కమాండింగ్ పొజిషన్ లో బీజేపీ ఉంటే ఆయనకు తిప్పలే అంటున్నారు .

ముందు మెజార్టీ చూపించినా, వెనకబడిన గ్రాండ్ అలయన్స్ ..అయినా గెలుస్తామంటున్న ఆర్జేడీ నేతల ధీమాముందు మెజార్టీ చూపించినా, వెనకబడిన గ్రాండ్ అలయన్స్ ..అయినా గెలుస్తామంటున్న ఆర్జేడీ నేతల ధీమా

బీజేపీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ట్లుగా తాజా ట్రెండ్స్

బీజేపీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ట్లుగా తాజా ట్రెండ్స్

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్న చర్చ దీంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హోరాహోరీగా చాలా నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి, మహాకూటమి తలపడుతున్నాయి. ఇప్పటివరకు బీహార్ ఎన్నికల ఫలితాలను బట్టి ఊహించని విధంగా బీజేపీ దూకుడు కొనసాగిస్తున్నట్లు గా తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ట్లుగా తాజా ట్రెండ్స్ చూపిస్తున్నాయి. దీంతో తదుపరి సీఎంగా నితీష్ కుమార్ కొనసాగుతారా లేదంటే బిజెపి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతుందా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

 చాలా వెనుకబడిన జేడీయూ .. దూసుకుపోతున్న బీజేపీ

చాలా వెనుకబడిన జేడీయూ .. దూసుకుపోతున్న బీజేపీ


బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో ఇప్పటివరకు బిజెపి 73 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుంటే ఆర్జేడీ 66 స్థానాల్లోనూ జేడీయూ 47 స్థానాల్లోనూ ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. జెడియు బీహార్ ఎన్నికల లో పెద్దగా ప్రభావం చూపించినట్లుగా కనిపించటంలేదు. దీంతో బీహార్ రాష్ట్రం పై బీజేపీ పట్టు సాధిస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చే అవకాశం కూడా లేకపోలేదని పెద్ద చర్చ జరుగుతోంది.

నాయకత్వ విషయంలో ఆలోచనలో పడిన బీజేపీ

నాయకత్వ విషయంలో ఆలోచనలో పడిన బీజేపీ

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియ ఈ విషయంపై మాట్లాడుతూ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ మమ్మల్ని విజయతీరాలకు చేర్చింది అంటూ పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రానికల్లా నిర్ణయం తీసుకుంటామని, అలాగే నాయకత్వ విషయంలో కూడా సాయంత్రానికి నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని నితీష్ నేపథ్యంలో ఎంపిక చేస్తామంటూ కైలాష్ విజయ్ వర్గియా ప్రకటించారు. అయినప్పటికీ నాయకత్వంపై సాయంత్రానికి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి .

 సీఎం గా అవకాశం ఇచ్చినా సరే నితీష్ కు కష్టాలే అంటున్న విశ్లేషకులు

సీఎం గా అవకాశం ఇచ్చినా సరే నితీష్ కు కష్టాలే అంటున్న విశ్లేషకులు

బిజెపి సొంతంగానే 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో జెడియు కేవలం 47 స్థానాలకు పరిమితం కావడంతో ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీదే పైచేయి గా ఉంటుంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ను మార్చే అవకాశం కూడా లేకపోలేదు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . ఈ పాయింట్ ని ఆధారంగా చేసుకొని కొత్త సీఎం అభ్యర్థిని బీజేపీ తెరపైకి తీసుకు వస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా జేడీయూ తక్కువ స్థానాలు గెలుచుకొని, బిజెపి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే, ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ నితీష్ కి తిప్పలు తప్పవు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన సీఎం అయినా బీజేపీ చెప్పినట్టు నడుచుకోవాల్సిందే . దీంతో నితీష్ కు ఇబ్బంది తప్పని పరిస్థితి

English summary
If the NDA wins after the Bihar election results, will Nitish Kumar be given a chance as CM? Or bring a new person to the screen? Even Nitish is given a chance, he will face problems if the BJP is in the commanding position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X