Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మన్నార్ గుడికి శశికళ స్ట్రాంగ్ వార్నింగ్: జీవితాంతం జైల్లో ఉండాలా ? ఏం మిగలదు జాగ్రత్త!

బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చేసిన చికిత్స విషయాలు, ఆమె మృతి, దానికి సంబంధించిన విషయాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యరాదని, నోరు అదుపులో పెట్టుకుంటే అందరికీ అన్నివిధాలుగా మంచిదని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ ఆమె కుటుంబ సభ్యులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఆగ్రహంతో లేఖ రాశారు.

కేంద్రం దగ్గర నివేదిక

కేంద్రం దగ్గర నివేదిక

మన కుటుంబంపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఓ నివేదిక అందిందని, దాని పర్యావసనమే ఆదాయపన్ను శాఖ దాడులని, కేంద్ర హోంశాఖ తన నివేదికలో పేర్కొన్న అంశాలు నిజమన్నట్లుగా మీరంతా వ్యవహరిస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని శశికళ లేఖలో హెచ్చరించారు.

Recommended Video

    Sasikala Wont Be Making Candles In Jail జైల్లో శశికళ దర్జాగా.. | Oneindia Telugu
    దినకరన్ తిక్క చేష్టలు

    దినకరన్ తిక్క చేష్టలు

    జయలలిత చనిపోయిన వెంటనే ఓ కేంద్ర మంత్రి తనకు అత్యతంత సన్నిహితులైన వారికి సీఎం పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నించారని టీటీవీ దినకరన్‌ ఇంతకుముందే బహిరంగంగా మీడియా ముందు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

    పరోక్షంగా వెంకయ్య మీద

    పరోక్షంగా వెంకయ్య మీద

    తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నదని, తాను ఉన్నంత వరకూ అదిసాధ్యం కాదని టీటీవీ దినకరన్ ఇంతకు ముందు పరోక్షంగా వెంకయ్యనాయుడి మీద విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రత్యక్షంగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద టీటీవీ దినకరన్ ఆరోపణలు చేశారు.

    వెంకయ్యనాయడు

    వెంకయ్యనాయడు


    జయలలిత మరణించక ముందు, చికిత్స పొందుతున్న చివరి రోజులు, ఆ తరువాత వెంకయ్యనాయుడు చెన్నైలోనే చాలా కాలం ఉండటంతో శశికళ కుటుంబ సభ్యులు ఇలాంటి ఆరోపణలు చేశారని సమాచారం.

    దినకరన్, దివాకరన్

    దినకరన్, దివాకరన్

    జయలలిత 2016 డిసెంబర్ నాలుగో తేదీ చనిపోయారని, అపోలో ఆసుపత్రి మాత్రం డిసెంబర్ 5వ తేదీ మరణించారని ప్రకటించిందని శశికళ సోదరుడు దివాకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డిసెంబర్ 4వ తేదీ అపోలో ఆసుపత్రిలో జయలలితను చూశానని, ఆ సమయంలో ఈసీఎంఓ (Extra corporeal membrane oxygenation)ను అమర్చారని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పి మరింత వివాదానికి తెరలేపారు.

    ఫ్యామిలీ రచ్చ

    ఫ్యామిలీ రచ్చ

    మన్నార్ గుడి ఫ్యామిలీలో ఆధిపత్యం కోసం దివాకరన్, టీటీవీ దినకరన్ వర్గాలు పోటీపడుతున్నాయి. ఈ సందర్బంలో జయలలిత విషయం పూర్తిగా మాకే తెలుసు అనే రీతిలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు శశికళ ఫ్యామిలీ మీద నిఘా వేశారని తెలిసింది.

    అంతా మీ కోసం

    అంతా మీ కోసం

    తన భర్తను కూడా పట్టించుకోకుండా మీరు సంపాధించుకోవడం కోసమే తాను ఎక్కువ కష్టపడ్డానని, ఇప్పుడు నన్ను మరన్నిచిక్కుల్లో పడేసే మాటలు బహిరంగంగా మాట్లాడుతున్నారని శశికళ తన భర్త నటరాజన్ కు పంపించిన లేఖలో కుటుంబ సభ్యుల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని వెలుగు చూసింది.

    జీవితాంతం జైల్లో !

    జీవితాంతం జైల్లో !


    ఇటీవల 187 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన సమయంలో శశికళ కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన రూ. 1,400 కోట్ల అక్రమాస్తులు సంపాధించారని వెలుగు చూసింది. మీరు ఇలాగే మాట్లాడితే తాను జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తోందని శశికళ ఆవేదన చెందారని సమాచారం.

    వార్నింగ్ వీరికే

    వార్నింగ్ వీరికే

    శశికళ ఆమె భర్తకు రాసిన లేఖలో ముఖ్యంగా కొందరి పేర్లు ప్రస్తావించి వార్నింగ్ ఇచ్చారని వెలుగు చూసింది. ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్, శశికళ సోదరుడు దివాకరన్, దివాకరన్ కుమారుడు జై ఆనంద్ లకు తీవ్రస్థాయిలో హెచ్చరించి వార్నింగ్ ఇచ్చారని తెలిసింది.

     ఏం మిగలదు జాగ్రత్త !

    ఏం మిగలదు జాగ్రత్త !

    తన మాట వినకుంటే జీవితంలో మీరు అంతా కోల్పోతారని, తన నుంచి ఏమి ఆశించినా ఏమీ మిగలదని శశికళ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తన పేరుతో, నా భర్త నటరాజన్ పేరుతో ఉన్న ఆస్తులు మొత్తం ఇళవరసి కుమార్తెలు, కుమారుడికి ఇచ్చేస్తానని, మీరు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా నష్టపోతారని టీటీవీ దినకరన్, దివాకరన్, జై ఆనంద్ లను శశికళ హెచ్చరించారని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+