హత్య: అపార్ట్‌మెంట్ పైనుంచి పడి ఐఐటి విద్యార్థి మృతి

అంచల్ భరద్వాజ్(21) అనే ఎంటెక్ విద్యార్థి శుక్రవారం ఆ భవనంపై నుంచి పడి మృతి చెందాడు. అయితే బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి తండ్రి మహావీర్ భరద్వాజ్ కథనం ప్రకారం.. భరద్వాజ్ సెక్టార్ 22లోని అపార్ట్‌మెంట్‌లో పెయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో భరద్వాజ్ కజిన్, అతని భార్యతోపాటు ఉంటున్నాడు. తరచుగా వారి ఇంటికి వెళుతుండేవాడు భరద్వాజ్. శుక్రవారం భరద్వాజ్‍ను అతని కజిన్ భోజనానికి ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత సాయంత్రానికి ఆ అపార్ట్‌మెంట్ పైనుంచి పడిపోయాడు.
తీవ్రగాయాలపాలైన భరద్వాజ్‌ను ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, తమ అపార్ట్‌మెంట్లో బంగారు నగలు పోయాయని కజిన్, అతని భార్య అంచల్ భరద్వాజ్‌ను అనుమానించారని తండ్రి మహావీర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంచల్ భరధ్వాజ్ నివాసముంటున్న గదిని తనిఖీ చేశారని చెప్పారు.
ఆ తర్వాత అతడ్ని ఇంటికి పిలిపించి వారే హత్య చేసి ఉంటారని మహావీర్ భరద్వాజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహావీర్, హర్యానాలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా అంచల్ గదిలోనే తమ బంగారు నగలు దొరికాయని అతని కజిన్ పోలీసులకు వెల్లడించాడు.












Click it and Unblock the Notifications