చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉరేసుకుని ఐఐటి- మద్రాసు విద్యార్థి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 IIT-Madras student hangs himself
చెన్నై: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మద్రాసు (ఐఐటి - మద్రాసు) విద్యార్థి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటి మద్రాసులో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఆ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజస్థాన్‌లోని కోటకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి అక్షయ్ కుమార్ మీనా పంపా హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటి అధికారులు చెప్పారు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణమేమిటనేది తెలియదు. సూసైడ్ నోట్ ఏదీ లభించకపోవడంతో అతని ఆత్మహత్యకు కారణం తెలియడం లేదు.

గత రెండేళ్ల కాలంలో ఐఐటి - మద్రాసులో ఇది మూడో ఆత్మహత్యా సఘటన. మీనా 2013 జులైలో ఐఐటిలో చేరారుడ. మీనా ప్రవర్తనలో తమకు ఏ విధమైన మార్పు కనిపించలేదని మిత్రులు, హాస్టల్ మేట్స్ అంటున్నారు.

ఆత్మహత్య చేసుకునేంత బలమైన కారణాలు ఏం ఉన్నాయనే విషయం కూడా తెలియడం లేదని వారంటున్నారు. చదువులో కూడా వెనకబడిపోలేదని చెబుతున్నారు. తనకు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఫోన్ చేశాడని, అతి మామూలుగానే మాట్లాడాడని తండ్రి అంటున్నారు.

English summary
A first-year student of chemical engineering committed suicide in his hostel room at Indian Institute of Technology-Madras on Friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X