కాక్రోచ్ లకు మద్దతివ్వద్దు- విద్యార్దులకు ఐఐటీ ఆదేశం-విమర్శలతో వివరణ..!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) నిర్వహిస్తున్న నిరసనల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా విద్యార్ధులు భారీగా తరలివస్తున్నారు. దీంతో జంతర్ మంతర్ విద్యార్ధులతో నిండిపోతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ విద్యార్ధుల నిరసనలకు భారీ మద్దతు లభిస్తోంది. దీన్ని అడ్డుకోవడమెలాగో తెలియక కేంద్రం మథనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఐఐటీ రూర్కీ (IIT Roorkee) తమ విద్యార్ధులకు జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమైంది.
ఢిల్లీలో విద్యార్ధుల నిరసనలకు మద్దతుగా సోషల్ మీడియాలో స్పందించవద్దంటూ తాజాగా ఐఐటీ రూర్కీ తమ విద్యార్ధులకు సూచన జారీ చేసింది. దీంతో విద్యార్ధుల గొంతు నొక్కుతున్నారంటూ ఐఐటీ రూర్కీపై విమర్శలు వచ్చాయి. భావప్రకటనా స్వేచ్ఛకు అత్యున్నత విద్యాసంస్ధ అయిన ఐఐటీ ఆదేశాలు ఇవ్వడమేంటన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఏఎన్ఐ వార్తా సంస్థకు ఐఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. ఆ సర్కులర్ ఎందుకు ఇచ్చారన్న దానిపై ఇందులో క్లారిటీ ఇచ్చారు.

విద్యార్థుల నిరసనలకు సోషల్ మీడియాలో మద్దతు ఇవ్వవద్దని సూచిస్తూ ఐఐటీ రూర్కీ జారీ చేసిన ఒక సలహా ప్రకటన వివాదానికి దారితీసిన నేపథ్యంలో, ఆ సంస్థ ANIకి వివరణ ఇచ్చింది. ఆ సమాచారం ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి పంపిణీ చేసే ఒక అంతర్గత సలహా మాత్రమేనని తేల్చేసింది. అలాగే అది ఎటువంటి కొత్త ఆదేశం లేదా విధానం కాదని ఐఐటీ రూర్కీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications