రూ.20 కోసం కక్కుర్తి పడితే... రూ.3 వేలు ఫైన్ వేశారు..
ప్రస్తుతం ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. చిన్న చిన్నదుకాణాలకు వెళ్లి షాపింగ్‌లు చేయడం ఈ కాలంలో చాలా తక్కువైపోయింది. బిగ్‌బజార్, డీమార్ట్‌ల వంటివాటికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు ప్రజలు. ఇక పండగ సీజన్లలో ఎక్కువ శాతం మంది వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, మాల్స్‌లో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ షాపింగ్ చేసినప్పడు, ఆ మాల్ వారే ఒక క్యారీ బ్యాగ్‌ను ఇస్తారు. దానికి కూడా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, కొన్ని మాల్స్‌లో క్యారీబ్యాగ్‌లకు వాటి లోగోలు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్‌లకు మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, బెంగుళూరులోని ఐకియా మాల్‌లోని క్యారీబ్యాగ్‌లకు లోగోలు ఉన్నాయి. అయినా సరే, వినియోదారుల నుంచి ఆ మాల్ సిబ్బంది డబ్బులు వసూలు చేశారు. ఈ విషయంపై ఓ మహిళ వినియోగదారుల కమీషన్ ను సంప్రదించింది. ఆ మాల్‌పై 20 రూపాయల క్యారీబ్యాగ్ కోసం 3 వేల రూపాయల ఫైన్ విధించింది వినియయోగుదారుల కోర్టు.. ఆ వివరాలేంటో చూద్దాం..

పట్టించుకోని ఐకియా మాల్ యాజమాన్యం: బెంగుళూరుకు చెందిన సంగీత బోహ్ర అనే మహిళ అక్టోబర్ 6న ఐకియా మాల్‌లో షాపింగ్ చేసింది. ఆ షాపింగ్‌లో సంగీత 2 వేల 428 రూపాయల విలువైన వస్తువులను కోనుగోలు చేయడం జరిగింది. అయితే, ఈ మాల్‌లో షాపింగ్ చేసేవారు ఇంటినుంచి బ్యాగ్‌లను తెచ్చుకోకూడదు. అందుకోసం ఆమెకు ఓ క్యారీ బ్యాగ్ అవసరమైంది. అయితే అక్కడ వున్న సిబ్బందిని క్యారీ బ్యాగ్ అడిగింది సంగీత. అయితే ఐకియా లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఇచ్చి ఆమె నుంచి 20 రూపాయలను వసూలు చేశారు అక్కడి సిబ్బంది.
కంపెనీ లోగో వున్న బ్యాగ్‌లకు కూడా డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిపై వాదనకు దిగింది సంగీత. అయినా, అక్కడి యాజమాన్యం ఏమాత్రం దాని గురించి పట్టించుకోలేదు. దాంతో ఆ మహిళ స్టారో లోగో ఉన్న బ్యాగ్‌కు 20 రూపాయలు ఎలా వసూలు చేస్తారంటూ వినియోగదారులు కమీషన్‌ను ఆశ్రయించింది. ఆ బ్యాగ్‌కు ఛార్జీ వసూలు చేసినందుకు పరిహారంగా మూడువేల రూపాయలు చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించింది ఆ మహిళ.
ఇరవై రూపాయల కవరుకు వడ్డీతో కలిపి నష్టపరిహారంగా వెయ్యి రూపాయలు, న్యాయపరమైన ఖర్చులకు రెండువేల రూపాయలు చెల్లించాలంటూ కోర్టును ఆదేశించింది. వస్తువులను డెలివరీ చేసే క్రమంలో అవసరమైన అన్నీ ఖర్చులను యాజమాన్యమే భరించాలంటూ స్టేట్ కమీషన్ పేర్కొంది. ఇందులో ఇచ్చిన తీర్పు ప్రకారం జరిమానా విధించిన 30 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications