Illegal affair: భర్తకు బూడిద, ప్రియుడికి పాండ్స్ పౌడర్, రెండు హత్యలు, ప్రియుడి ఏజ్, గేజ్ తెలిస్తే !
చెన్నై/ కోయంబత్తూరు: భర్తతో కలిసి హ్యాపీగా కాపురం చేస్తున్న భార్య ప్రియుడి మోజులో పడిపోయింది. ప్రియుడు వ్యవసాయ పొలంలో పని చేస్తున్న భార్య అతనితో ఎంజాయ్ చేస్తోంది. వయసు మీద పడిన తనకు స్వర్గం చూపిస్తున్న ప్రియురాలి మోజులో పడిపోయిన వ్యక్తి అన్నీ మరిచిపోయాడు. భర్తకు అతని భార్య అక్రమ సంబంధం విషయం తెలిసిపోయి పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ప్రియుడు దక్కాలంటే కచ్చితంగా తన భర్తను చంపేయాలని భార్య డిసైడ్ అయ్యింది. అనుకున్న స్కెచ్ ప్రకారం ప్రియుడితో కలిసి భార్య ఆమె భర్తను దారణంగా చంపేసింది. భర్తను చంపి శవం కాల్చేస్తున్న సమయంలో విషయం గుర్తించిన మరో వ్యక్తి అతని భార్య, ఆమె ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ కొంతకాలం డబ్బులు తీసుకుంటూ కాలం గడిపేశాడు. మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే ఊరి వాళ్లకు విషయం చెబుతామని బెదిరిస్తున్న రైతును కూడా ఆంటీ, ఆమె ప్రియుడు కలిసి దారుణంగా చంపేశారు. భర్తను, రైతను చంపేసి ప్రియుడితో పాటు ఎంజాయ్ చేస్తున్న భార్య 8 నెలల తరువాత పోలీసులకు చిక్కింది. భర్తను, రైతును హత్య చెయ్యడానికి కారణం అయిన ఆంటీ ప్రియుడి వయసు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

భూమిని కోలుకు ఇచ్చిన యజమాని
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పెరుమాళ్లపాలెంలోని గ్రామంలో వేలుస్వామి (47) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వేలుస్వామికి భూములు చాలా ఉన్నాయి. ముత్తుస్వామి అనే వ్యక్తి వేలుస్వామి భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేయిస్తున్నాడు. ముత్తుస్వామి దగ్గర కొందరు వ్యవసాయ కూలీలు పని చేస్తున్నారు.

వ్యవసాయం చేస్తున్న దంపతులు
ముత్తుస్వామి లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న పొలంలో రవి, అంసవేణి (42) దంపతులు పని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రవి, అంసవేణి దంపతులు అదే పొలంలో పని చేసి సాయంత్రం ఇంటికి వెలుతున్నారు. తన పొలంలో పని చేస్తున్న అంసవేణి మీద ముత్తుస్వామి కన్ను వేశాడు.

ముసలోడికి స్వర్గం చూపించిన అంసవేణి
ముత్తుస్వామి పొలం పనుల మీద ఊరిలోని, బయట ఊరికి భర్త రవిని పంపిస్తున్నాడు. రవి బయటకు వెళ్లిన తరువాత అతని భార్య అసంవేణితో ముత్తుస్వామి సరసాలు ఆడటం మొదలు పెట్టాడు. మాకు పని ఇచ్చిన ముత్తుస్వామి కోరికను అంసవేణి కాదనలేకపోయింది. 77 సంవత్సరాల వయసు ఉన్నా ముత్తుస్వామి బలంగా ఉండటంతో ముసలోడికి అంసవేణి స్వర్గం చూపించడం మొదలు పెట్టింది.

భూమి లీజు విషయంలో తేడాలు
మూడు సంవత్సరాల నుంచి వేలుస్వామి భూమిని ముత్తుస్వామి లీజుకు తీసుకున్నాడు. ఇటీవల వేలుస్వామి భూమిని అతని భార్య కూతురి పేరు మీద రిజిస్టర్ చేయించింది. వేలుస్వామితో గొడవపడిన అతని భార్య వేరుగా కాపురం పెట్టింది. ఇక ముందు భూమి లీజు డబ్బులు మాకే ఇవ్వాలని వేలుస్వామి భార్య ముత్తుస్వామికి చెప్పింది. వేలుస్వామి కూడా భూమి లీజు డబ్బులు తన భార్యకు ఇవ్వకూడదని, తనకే ఇవ్వాలని ముత్తుస్వామికి తేల్చి చెప్పాడు. వేలుస్వామి, అతని భార్య పదేపదే డబ్బులు మాకే ఇవ్వాలని పట్టుబట్టడంతో ఎవరికి డబ్బులు ఇవ్వాలో తేలీక ముత్తుస్వామి అయోమయంలో పడిపోయాడు.

మంచి మూడ్ లో ఎంట్రీ ఇచ్చిన భూస్వామి
8 నెలల క్రితం ముత్తుస్వామి అతని ప్రియురాలు అంసవేణి భర్త రవిని వ్యవసాయం కోసం ఎరువు తీసుకురావాలని కోయంబత్తూరుకు పంపించాడు. రవి బయటకు వెళ్లిన తరువాత అతని భార్య అంసవేణితో ముత్తుస్వామి వ్యవసాయ పొలంలోని పంప్ సెట్ రూమ్ లో మంచి రసపట్టులో ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన వేలుస్వామి తన భూమి లీజు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటూ గొడవ పెట్టుకున్నాడు.

చంపేసి శవాన్ని బూడిద చేశారు
మంచి మూడ్ లో వేలుస్వామి ఎంట్రీ ఇవ్వడంతో అతనితో ముత్తుస్వామి గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. తరువాత ముత్తుస్వామి అతని ప్రియురాలు అంసవేణి సహాయంతో వేలుస్వామి మీద కర్రలతో దాడి చేసి చంపేశారు. వేలుస్వామి శవాన్ని అదే పొలంలో కర్రలు పేర్చి కాల్చి బూడిద చేసేశారు. వేలుస్వామి కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టలేదు. అప్పటికే వేలుస్వామితో అతని భార్య విడిపోవడంతో ఆ కేసు తెరమరుగు అయ్యింది.

బ్లాక్ మెయిల్ చేసిన మొగుడు
తన భార్య అంసవేణి తాము పని చేస్తున్న పొలం యజమాని ముత్తుస్వామితో అక్రమ సంబంధం పెట్టుకునిందని తెలిసినా రవి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా చూసి చూడనట్లు ఉండిపోయాడు. అయితే భర్త రవితో కలిసి మద్యం సేవించిన అతని భార్య అంసవేణి ప్రియుడు ముత్తుస్వామి మేము వేలుస్వామిని చంపేశామని నోరుజారాడు. అంతే అప్పటి నుంచి రవి అతని భార్య అంసవేణి, ఆమె ప్రియుడు ముత్తుస్వామిని బ్లాక్ మెయిల్ చేస్తూ మద్యం సేవించడానికి డబ్బులు ఇప్పించుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. రవికి ఇంతో అంతో డబ్బులు ఇస్తున్న ముత్తుస్వామి అతని భార్య అంసవేణితో ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేశారు.

టార్చర్ ఎక్కువ కావడంతో భర్త హత్య
రవి రానురాను అతని భార్య అంసవేణి, ఆమె ప్రియుడు ముత్తుస్వామిని ఎప్పుడంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే మీరు వేలుస్వామిని హత్య చేశారని ఊర్లో అందరికి చెప్పేస్తానని రవి బెదిరించాడు. వేలుస్వామిని హత్య చేశామని అతని కుటుంబ సభ్యులకు తెలిస్తే మమ్మల్ని చంపేస్తారని ముత్తుస్వామి, అతని ప్రియురాలు అంసవేణి భయపడిపోయారు. తరువాత పక్కాప్లాన్ తో ప్రియుడు ముత్తుస్వామితో కలిసి అంసవేణి మద్యం మత్తులో ఉన్న భర్త రవిని చంపేసి అతని శవాన్ని కాల్చి బూడిద చేసేశారు.
తరువాత తన భర్త రవి కనపడటం లేదని అతని భార్య అంసవేణి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కథ మలుపు తిరిగింది.
Recommended Video

8 నెలలు ఎంజాయ్ చేసి చివరికి ?
భూస్వామి వేలుస్వామిని, భర్త రవిని హత్య చేసిన అంసవేణి ఆమె ప్రియుడితో కలిసి 8 నెలల పాటు ఎంజాయ్ చేసింది. భర్త రవి కనపడటం లేదని కేసు పెట్టిన అంసవేణి ప్రియుడు ముత్తుస్వామితో కలిసి ఎంజాయ్ చెయ్యడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రవి కేసులో అదుపులోకి తీసుకోవడంతో భూస్వామి వేలుస్వామి హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వేలుస్వామి, రవిని తామే హత్య చేశామని అంసవేణి, ముత్తుస్వామి అంగీకరించారని పోలీసులు అన్నారు. రవి ముత్తుస్వామిని కాల్చి బూడిద చేసిన ప్రాంతాల్లో ఎముకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించామని, ముత్తుస్వామి, అంసవేణిని జైలుకు పంపించామని పోలీసులు చెప్పారు. 77 ఏళ్ల వయసు ఉన్న ముసులోడైన ప్రియుడి కోసం భూస్వామి వేలుస్వామిని, భర్త రవిని అంసవేణి హత్య చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications